kodalinani

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

వైసీపీ నేతలపై , వైసీపీ సోషల్ మీడియా వారిపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసిన అక్రమాలకు , దోపిడీలకు మూల్యం చెల్లించుకుంటున్నారు. అధికార అండ చూసుకొని ఇష్టం వచ్చినట్లు చేసిన వారిపై ఇప్పుడు వరుస కేసులు నమోదు చేస్తున్నారు.ఇప్పటికే పలువురి ఫై కేసులు నమోదు కావడం తో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఇప్పుడు మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని ఫై కేసు నమోదు అయ్యింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేశ్‌లను సోషల్ మీడియా మాధ్యమాల్లో నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారంటూ ఏయూ లా కాలేజీకి చెందిన అంజనప్రియ అనే విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక స్త్రీగా కొడాలి నాని తిట్ల పురాణాన్ని సహించలేకపోయానని పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు.

అలాగే కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన వారి జాబితాలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి కూడా ఉన్నాడు.

Related Posts
ఇండియా , యుకె మరియు యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా
BAFTA reveals nominees for Breakthrough 2024 across India UK and USA

న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ మద్దతుతో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా), ఈ రోజు చలనచిత్రం, టెలివిజన్ మరియు గేమ్‌ల పరిశ్రమల నుండి తమ Read more

శోభితా నాకు ముందే తెలుసు: నాగార్జున
శోభితా నాకు ముందే తెలుసు: నాగార్జున

శోభితా నాకు ముందే తెలుసు, చై కంటే ముందే తెలుసునని నాగార్జున వెల్లడించారు నటుడు నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె Read more

ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం – డిప్యూటీ సీఎం భట్టి
gaddar awards

ఉగాది పండుగ సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో మాట్లాడిన భట్టి, Read more

రేపు జగన్ ప్రెస్ మీట్
jagan2.0

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *