EVKS

మాజీ కేంద్ర మంత్రి ఇళంగోవ‌న్ మృతి

మాజీ కేంద్ర మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవ‌న్ ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 73 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధ‌ప‌డ్డారు. నెల రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. న‌వంబ‌ర్ 13వ తేదీన ఎంఐఓటీ హాస్పిట‌ల్‌లో చేరారు. ఆయ‌న‌కు భార్య‌, కుమారుడు ఉన్నారు. 2023 ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో .. ఈరోడ్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఆయ‌న కుమారుడు తిరుమ‌గ‌న్ ఇవెర మృతిచెందిన నేప‌థ్యంలో అక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించారు.
ఈవీ రామ‌స్వామి బంధువే ఇళంగోవ‌న్‌
ద్రావిడ ఉద్య‌మ నేత పెరియార్ ఈవీ రామ‌స్వామి సోద‌రుడి మన‌వ‌డే ఇళంగోవ‌న్‌. చిన్న వ‌య‌సులోనే ఇళంగోవ‌న్ రాజ‌కీయ ఎంట్రీ చేశారు. 1984లో ఆయ‌న తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 2004లో ఆయ‌న లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో ఆయ‌న కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రిగా చేశారు. త‌మిళ‌నాడు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా కూడా చేశారు.

Related Posts
దేశ చరిత్రలో తొలిసారిగా రూ.50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ పర్యాయం కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బడ్జెట్ రూ.50 Read more

బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్
bsnl

ఏడాది కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. తరచూ రీఛార్జ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రూ.2398 ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ Read more

రియల్ ఎస్టేట్ 21% తాగింది
రియల్ ఎస్టేట్ 21% తాగింది

హైదరాబాద్‌లో 47% తగ్గాయి, ఢిల్లీలో 25% పెరుగుదల డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ 21% తాగింది అని PropEquity తెలిపింది. హైదరాబాద్‌లో Read more

ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ తో భద్రత మరింత కట్టుదిట్టం
ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ తో భద్రత మరింత కట్టుదిట్టం

సరిహద్దుల్లో పహారా కాచే సైన్యం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలంటే కాలి నడకను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి Read more