Komireddy Jyoti Devi

మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి కన్నుమూత

మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి గారి మృతి పట్ల రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. జ్యోతిదేవి గారు 1998లో మెట్‌పల్లి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సుమారు 17 నెలల పాటు మెట్పల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవలందించారు. జ్యోతి దేవి మృతితో మెట్‌పల్లి పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మరణం పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. మలేషియా పర్యటన కోసం బయలుదేరిన మహేష్ కుమార్ గౌడ్, ఎయిర్ పోర్టు నుంచి జ్యోతి దేవి కుమారుడు కోమిరెడ్డి కరం గారిని ఫోన్ చేసి, ఆమె మరణవార్తను తెలుసుకున్నారు. ఆయన అనంతరం జ్యోతి దేవి కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తం చేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. న్యాయ విద్యనభ్యసించిన (LLB) చదివిన జ్యోతిదేవిని మెట్‌పల్లి ప్రాంత ప్రజలు ప్రేమగా జ్యోతక్క అని పిలుస్తారు. జ్యోతిదేవి భర్త రాములు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది. 1994లో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట ఎంపీటీసీగా విజయం సాధించారు. అనంతరం ఎంపీపీగా మండల ప్రజలకు సేవలందించారు.

మెట్‌పల్లి ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1998లో ఎంపీగా విజయం సాధించగా.. అక్కడ ఉపఎన్నిక నివార్యమైంది. అప్పటికే ఎంపీపీగా కొనసాగుతున్న జ్యోతిదేవి ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీశారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై విజయం సాధించారు. సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఆమె ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో ఆందోళనలు చేసి ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ దృష్టిలో పడ్డారు. దీంతో జ్యోతిదేవిని ఆలిండియా మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్‌ నాయకురాలిగా సోనియా నియమించారు. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో ఆమె అనేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక 2004 ఎన్నిక‌ల్లో ఆమె భ‌ర్త కొమొరెడ్డి రాములు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. జ్యోతిదేవి రాములు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో జ్యోతిదేవి భర్త, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు సైతం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఆయన తనువు చాలించారు. రాములు మెట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా 2004లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమొరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Related Posts
హైదరాబాద్‌లో ముజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ
Muzhigal Music Academy in Hyderabad

కామాక్షి అంబటిపూడి ( ఇండియన్ ఐడెల్ గాయని) ప్రారంభించారు. వ్యవస్థీకృత సంగీత పరిశ్రమలో సుప్రసిద్ధ సంస్థగా తమను తాము నిలుపుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న ముజిగల్‌, తమ కార్యకలాపాలను Read more

తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నిక
Election of TDP candidate as Deputy Mayor of Tirupati

తిరుపతి: తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ పదవిని ఎన్డీయేలోని టీడీపీ కైవసం చేసుకుంది. కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నికను మంగళవారం తిరుపతి ఎస్వీ వర్సిటీ Read more

బాంబు బెదిరింపు..శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్‌: దేశంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. తాజాగా బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి Read more

డీఎస్సీ ఉపాధ్యాయుల పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా
Postponement of counseling for DSC teachers

హైదరాబాద్‌: డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త Read more