chicken

మాంసపు ప్రియులు జాగ్రత్త

చాలా మంది మాంసపు ప్రియులు చికెన్ ను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు . ముఖ్యంగా రెస్టారెంట్ట్స్ లలో చేసే చికెన్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ వారు ఎంత నాణ్యమైన చికెన్ ని తింటున్నారో జాగ్రత్త తీసుకోవాలి.చాలా రెస్టారెంట్లు కుళ్లిపోయిన చికెన్ తో వంటలు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యం లో శుక్రవారం అక్టోబర్ 18వ రోజు జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ మరియు ఎస్‌వోటీ పోలీసులు బేగంపేట ప్రకాశ్‌నగర్‌ లోని బాలయ్య చికెన్‌ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. దీనిలో 700 కిలోలకు పైగా కుళ్లిపోయిన చికెన్‌, ఎముకలు మరియు చికెన్‌ వేస్ట్‌ లభ్యమైంది. ఆ చికెన్‌ సెంటర్‌లోకి వెళ్లిన అధికారులు రిఫ్రిజిరేటర్‌ తెరవగానే దుర్వాసన రావడంతో చాలా ఆశ్చర్చపోయారు. చాలా రోజుల క్రితం నిలువ ఉంచిన చికెన్ చెడు వాసన రాకుండా రసాయనాలను ఉపయోగించారని అధికారులు తెలిపారు. మరియు చికెన్ సెంటర్ ని సీజ్‌ చేసి కుళ్లిపోయిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. చికెన్ సెంటర్ ఓనర్ ను అరెస్ట్ చేసారు.

గతం లో కూడా ఈ విధముగా చాలా రెస్టారెంట్ లు కుళ్లిపోయిన చికెన్ ను విక్రయించారు. అది పాడైపోయిన వాసన రాకుండా రసాయన చికిత్సల ఉపయోగం ముఖ్యంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే దీనివల్ల మాంసం వినియోగం సురక్షితం కాదని వినియోగదారులకు గుర్తించడం కష్టమవుతుంది. ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నందున ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి తనిఖీలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

Related Posts
సీగ్రమ్స్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజికల్ ఉత్సవం..
Seagram Royal Stag Boom Box Musical Festival

‘లివింగ్ ఇట్ లార్జ్’ స్ఫూర్తికి చిహ్నంగా హైదరాబాద్‌లో బోల్డర్ హిల్స్ లో జనవరి 25న మ్యూజిక్ మరియు యువ సంస్కృతి యొక్క వైభవోపేతమైన సంబరం. రాయల్ స్టాగ్ Read more

భారతదేశంతో జిమ్మీ కార్టర్ అనుబంధం
భారతదేశంతో జిమ్మీ కార్టర్ అనుబంధం

జనవరి 3, 1978న, జిమ్మీ కార్టర్, అప్పటి ప్రథమ మహిళ రోసలిన్ కార్టర్‌తో కలిసి హర్యానాలోని దౌలత్‌పూర్ నసీరాబాద్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా, అక్కడి ప్రజలు ఆయనను Read more

జపాన్‌లో దేవర సినిమా సందడి.
devara movie

బాహుబలి మరియు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో రాజమౌళి జపాన్‌లో తెలుగు సినిమాలకు ఓ కొత్త విభాగాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ తో ఎన్టీఆర్‌కి జపాన్‌లో విపరీతమైన Read more

క్లీన్ ఈక్వల్ మిషన్‌ను పరిచయం చేసిన ఐటీసీ నిమైల్
ITC Nimile introduced Clean Equal Mission

సమానత్వంతో కూడిన భవిష్యత్తు కోసం క్లీన్ ఈక్వల్ టుడేని సమిష్టిగా నిర్మించే ఆలోచన రేకెత్తించే, కార్యాచరణ ఆధారిత ప్రయత్నం.. హైదరాబాద్: భారతదేశంలో విశ్వసనీయ గృహ పరిశుభ్రత బ్రాండ్, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *