kerala high court

మ‌హిళ‌ల శ‌రీరంపై కామెంట్ చేసినా లైంగిక వేధింపే: కేర‌ళ హైకోర్టు

ఉద్యోగం చేసే మ‌హిళ‌లు ఎన్నో వత్తిడిలకు గురిఅవుతున్నారు. నిత్యం లైంగిక వేధింపుల ఇబ్బందులకు గురిఅవుతున్నారు. వారి శ‌రీరంపై కామెంట్ చేస్తుంటారు. ఇలా కామెంట్ చేసినా అది లైంగిక వేధింపు కిందికి వస్తుందని కేర‌ళ హైకోర్టు స్పష్టం చేసింది. మ‌హిళ‌ల శ‌రీరం నిర్మాణంపై ఎటువంటి వ్యాఖ్య‌లు చేసినా.. అది లైంగిక వేధింపు అవుతుంద‌ని కేర‌ళ హైకోర్టు పేర్కొన్న‌ది.
త‌న‌పై న‌మోదు అయిన కేసును కొట్టివేయాల‌ని కోరుతూ ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ‌కు చెందిన ఉద్యోగి పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తిర‌స్క‌రించింది. జ‌స్టిస్ ఏ బ‌ద‌రుద్దీన్ ఈ తీర్పును ఇచ్చారు. కేర‌ళ విద్యుత్తు శాఖకు చెందిన ఓ మ‌హిళా ఉద్యోగినిపై మ‌రో ఉద్యోగి కామెంట్ చేశారు. దీంతో ఆమె లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేసింది. ఆ కేసును కొట్టివేయాల‌ని కోరుతూ ఆ ఉద్యోగి కోర్టును ఆశ్ర‌యించాడు. 2013 నుంచి ఆ ఉద్యోగి చాలా అస‌భ్య‌క‌ర‌మైన భాష‌ను వాడార‌ని, 2017లో అభ్యంత‌ర‌క‌ర‌మైన మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ చేసేవాడ‌ని ఆమె ఆరోపించింది. విద్యుత్తు శాఖకు ఫిర్యాదు చేసినా ప్ర‌యోజ‌నం లేకుండాపోయిందన్నారు.

Advertisements


మ‌హిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని సెక్ష‌న్ 354ఏ(లైంగిక వేధింపులు), 509(మ‌హిళ‌ను కించ‌ప‌ర‌చ‌డం), సెక్ష‌న్‌120(ఓ) కింద కేసు బుక్ చేశారు. కేర‌ళ పోలీసు చ‌ట్టంలోని సెక్ష‌న్ 120(ఓ) కింద కూడా ఆ ఉద్యోగి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. అయితే కేవ‌లం శ‌రీర శౌష్ట‌వం బాగుంద‌ని కామెంట్ చేసినంత మాత్రానా.. త‌న‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేశార‌ని, ఆకేసును కొట్టివేయాల‌ని విద్యుత్తు శాఖ ఉద్యోగి కోర్టును ఆశ్ర‌యించారు.

కాల్స్‌, మెసేజ్‌ల‌తో నిందిత వ్య‌క్తి లైంగిక వేధింపుల కామెంట్స్ చేసిన‌ట్లు మ‌హిళా ఉద్యోగి ఆరోపించింది. అయితే ఐపీసీలోని సెక్ష‌న్ 354ఏ, 509తో పాటు సెక్ష‌న్ 120 కేర‌ళ పోలీసు చ‌ట్టం ప్ర‌కారం నిందితుడిపై త‌గిన ఆధారాలు ఉన్న‌ట్లు హైకోర్టు తెలిపింది.

Related Posts
తమిళ భాషపై కేంద్రం వైఖరిని ప్రశ్నించిన సీఎం స్టాలిన్
తమిళ భాషపై కేంద్రం వైఖరిని ప్రశ్నించిన సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ హిందీని బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తమిళం లేదా ఇతర దక్షిణాది భాషలను బోధించడానికి కేంద్రం Read more

Markets: తేరుకున్న ప్రపంచ మార్కెట్లు
Markets: తేరుకున్న ప్రపంచ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శత్రు, మిత్ర దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాల ఉత్పత్తులపై Read more

ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు నవంబర్ 23న ప్రకటించబడతాయి
exit poll

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో జరిగిన ఉత్కంఠభరితమైన ఎన్నికల తరువాత, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు తీవ్రమైన పోటీల మధ్య సాగాయి. Read more

ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు..
Lokayukta notice to Chief Minister Siddaramaiah

బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు Read more

Advertisements
×