Sarkar has released Rs.30 c

మహిళల కోసం రూ.30 కోట్లు విడుదల చేసిన సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో తీపి కబురు అందిస్తూ, వడ్డీలేని రుణాల పై మిత్తి పైసలు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన మొత్తం రూ.30.70 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, త్వరలో ఈ నిధులను మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయనుంది.

ప్రాంతాల వారీగా చూస్తే, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5,283 సంఘాలకు రూ.1.99 కోట్లు, నిజామాబాద్‌లో 5,010 గ్రూపులకు రూ.1.91 కోట్లు, ఖమ్మంలో 3,983 సంఘాలకు రూ.1.66 కోట్లు, కరీంనగర్‌లో 3,983 గ్రూపులకు రూ.1.55 కోట్లు విడుదల చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ సొమ్ము ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ఆ సంఘాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాయి. ఈ పాత పెండింగ్ వడ్డీని విడుదల చేయడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఉపశమనం కలిగినట్లు అవుతుంది.

Related Posts
రోజు రోజుకు పెరిగిపోతున్న మైక్రో ఫైనాన్స్‌ ఆగడాలు
Micro finance which is incr

మైక్రో ఫైనాన్స్‌ ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. వరంగల్, కరీంనగర్, విశాఖ వంటి పలు జిల్లాల్లో రుణ సంస్థల బాధలు భరించలేక కొందరు ఇప్పటికే మృత్యు Read more

వివేకా హత్య కేసు – భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
viveka murder case baskar r

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీజేఐ జస్టిస్ Read more

రాంగోపాల్‌ వర్మకు బిగ్‌ షాక్‌..
Big shock for Ramgopal Varma

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడిగా పేరుపొందిన రాంగోపాల్‌ వర్మ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు Read more

లాపిస్ టెక్నాలజీస్ బిజినెస్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
Launch of Lapis Technologies Business Innovation Centre

హైదరాబాద్: లాపిస్ టెక్నాలజీస్ తన బిజినెస్ ఇన్నోవేషన్ సెంటర్‌ను తార్‌బండ్ సమీపంలోని కార్పొరేట్ కార్యాలయంలో ప్రారంభించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సహకారంతో రూపొందించిన ఈ కేంద్రం.. ఎల్‌జీ విస్తృత Read more