ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రాంతంలో 19 జనవరి ఆదివారం సాయంత్రం ఒక పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్లు పేలి జరిగినట్టు తెలుస్తోంది.గీతా ప్రెస్ టెంట్‌లో సాయంత్రం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సమీపంలోని 10 టెంట్లకు వ్యాపించి,తీవ్రంగా దగ్ధం చేశాయి.ఇన్నిటికీ సత్వర స్పందనగా పోలీసులు,ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.ఎన్డీఆర్‌ఎఫ్ టీం కూడా అలర్ట్ అవుతూ, ప్రమాద ప్రాంతంలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఈ ఘటనలో గాయపడిన వారు లేకపోయినట్లు అధికారులు తెలిపారు.మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.ఆయన,అగ్నిప్రమాదంపై వివరాలు తెలుసుకుని,సంబంధిత అధికారులకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు.ఆయన, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తో ఫోన్ చేసి, పరిస్థితిని తెలుసుకున్నారు. మోదీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని,అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహా కుంభమేళా 2025 ప్రారంభం నుండి, భారీ సంఖ్యలో భక్తులు అక్కడ చేరుకున్నారు.జనవరి 18 నాటికి 77.2 మిలియన్ల పైగా భక్తులు కుంభమేళాలో పాల్గొనగా, ఆదివారం ఒక్క రోజులోనే 46.95 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్‌లో శాంఖనాదాలు, భజనలతో ఉత్సాహం అలుముకున్నది.”హర్ హర్ మహాదేవ్”, “జై శ్రీరామ్”, “జై గంగామయ్యా” వంటి నినాదాలతో నగరం మార్మోగిపోతుంది.భక్తుల ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు,యూపీ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 వందల 96 ఛార్జీలతో, భక్తులు గగనతలం నుంచి మహా కుంభమేళా మరియు ప్రయాగ్ రాజ్ నగరాన్ని వీక్షించవచ్చు.ఈ ఘటనతో మహా కుంభమేళా యాత్రికులకు ఏవైనా ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది.