తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో ఓ కీలక మార్పు జరగబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం తిరిగి బండి సంజయ్‌కి రాష్ట్రం లో బీజేపీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..? బండి సంజయ్ గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీకి మంచి జోష్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వంలో బీజేపీ గత ఎన్నికల్లో అనూహ్య విజయాలను సాధించింది. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటెల విజయం వెనుక బండి సంజయ్ కష్టం ఎంతో ఉంది.
ఇక, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాల కోసం ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఎంపీలు అరవింద్, రఘునందన్రావు, డీకే అరుణ, మరియు ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే, బండి సంజయ్ పట్ల పార్టీ లో ఉన్న నమ్మకం, ఆయన ప్రజలతో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకే మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
Also Read: రైతు భరోసా విధివిధానాలు ఖరారైనట్లేనా..?
ఇంకా, బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ ను కేంద్రమంత్రిగా నియమించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ తెలంగాణలో బీజేపీకి కీలకమైన నేతగా ఉన్నారు. అలాగే ఆయనపై గౌరవం కూడా ఎక్కువగా ఉంది. ఆయనకు కేంద్రంలో పదవిని ఇచ్చి తెలంగాణలో పార్టీని మరింత శక్తివంతం చేయాలని ఆ పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తెలంగాణలో బీజేపీ రాజకీయాలకు ఒక కీలక మలుపుగా మారిపోతుందనే సూచనలున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి, పోటీని మరింత ఉత్కంఠంగా మార్చేందుకు ఈ పరిణామాలు కీలకంగా మారవచ్చు. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.