hydhydraa

మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పిన హైడ్రా

రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. ఆల్వాల్ ప్రాంతంలో ప్రభుత్వం భూమిని ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు అందింది. సిబ్బంది తక్షణం అక్కడ పరిశీలనలు జరిపి, అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. వెంటనే బుల్డోజర్‌తో అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేశారు. అక్కడ “ఇది ప్రభుత్వ భూమి” అని బోర్డు ఏర్పాటు చేశారు.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో కూడా హైడ్రా అధికారులు చర్యలకు దిగారు. చెరువుల భూములను ఆక్రమించి నిర్మించిన హద్దు గోడలను జేసీబీలతో తొలగించారు. ఖాళీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులన్నింటిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో ప్రజల నుండి ఫిర్యాదులు అధికంగా రావడం ప్రారంభమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అలాగే హైడ్రా అధికారులు సైతం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే తక్షణమే సమాచారం అందించాలని, ఆ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Posts
ఇక పై తిరుమల అన్నప్రసాదంలో వడలు ?
TTD introduced masala vada in Tirumala Annaprasadam?

తిరుమల: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని Read more

వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతి
Watchman Ranganna Dies

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వివేకా Read more

మోదీకి బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చిన ట్రంప్
మోదీకి బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చిన ట్రంప్

ట్రంప్ గిఫ్ట్‌గా ఇచ్చిన పుస్తకం యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి "Our Journey Together" అనే పుస్తకాన్ని గిఫ్ట్‌గా అందజేశారు. Read more

దీపావళి ఎడిషన్‌ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
Diwali edition launched by Telangana Govt

హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, ప్రభుత్వం. HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌లో HIJS (హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో) - దీపావళి ఎడిషన్‌ను Read more