మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. మన్మోహన్ సింగ్ పాడెను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోశారు. ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాని గుర్తు చేసుకున్నారు. నిగంబోధ్ ఘాట్ లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు.
అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. పలువురు విదేశీ ప్రముఖులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వీరిలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్ కూడా ఉన్నారు. కాగా అంత్యక్రియలనుసిక్కు సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.