manmohan singh

మన్మోహన్ సింగ్ ఆర్ధిక సంస్కరణల నాయకుడు

అతి సామాన్య వ్యక్తిగా పుట్టి, అసమానమైన వ్యక్తిగా ఎదిగిన మన్మోహన్ సింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధలో, అదీ రాజకీయ నాయకుడిగా కీలక పదవిలో పదేళ్ల పాటు ఉన్న ఓ నేత తనను చరిత్ర దయతో గుర్తుంచుకుంటుందన్న మాట చెప్పాలంటే ఎంత కష్టం. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం 2014లో తాను పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విషయాన్ని రాతపూర్వకంగా అందరికీ తెలిపారు. అయితే అంత గర్వంగా చెప్పుకోవడానికి కారణమైన మన్మోహన్ కెరీర్ పొందిన ఒడిదుడుకులను గమనిద్దాం.
ఆర్ధిక మంత్రిగా అమోఘమైన సేవలు
1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్ధిక వేత్తగా ఉన్న తనను ఆర్ధిక మంత్రిని చేసినప్పుడు మన్మోహన్ సింగ్ ఉప్పొంగిపోలేదు. తన ముందున్న సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా పట్టు వదలకుండా పోరాటం చేశారు. భారత్ ను పేదరికం నుంచి ఎలా బయటపడేయాలి, ఆర్ధిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి, ఉన్న వనరుల్ని వాడుకుంటూనే స్వయం సమృద్ధి ఎలా సాధించాలన్న అంశాల చుట్టూనే ఆయన మనసు తిరిగింది. పీవీ హయాంలో ఆర్దిక మంత్రిగా ఐదేళ్లే ఉన్నా ఆ తర్వాత తరాలకు సరిపడా సంస్కరణలు అప్పట్లోనే తీసుకొచ్చిన మేథావి మన్మోహన్.
ఆర్ధిక వ్యవస్థ రూపురేఖల్ని మార్చివేశారు
11 రోజుల వ్యవధిలో రెండుసార్లు రూపాయి విలువ తగ్గింపు దగ్గరి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు దారులు తెరవడం, దేశంలో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా గ్లోబలైజేషన్ కు తాము సిద్దంగా ఉన్నట్లు ప్రపంచానికి మన్మోహన్ పంపిన సంకేతాలు ఆర్ధిక వ్యవస్థ రూపురేఖల్నే మార్చేశాయి.ఆర్ధిక సరళీకరణ విధానాలతో ప్రపంచ చిత్ర పటంలో భారత్ ను నిలబడేలా చేసిన మన్మోహన్ 2004లో ప్రధాని అయ్యాక పదేళ్ల పాటు ఆర్ధిక సంస్కరణలను మరింత వేగంగా చేపట్టి ఆర్దిక వృద్ధి సాధించేలా చేశారు. అందుకే అంత ధైర్యంగా చరిత్ర తనను దయతో గుర్తిస్తుందని ఆయన చెప్పుకున్నారు.

Advertisements
Related Posts
Acid Attack : కువైట్‌లో తెలుగు మహిళపై యాసిడ్ తో దాడి
acid attack

ఆర్థిక అవసరాల కోసం కువైట్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళపై యజమానులు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం Read more

సోనూసూద్ ను అరెస్ట్ చేయబోతున్నారా..?
sonu arrest

ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని ముంబై పోలీసులకు ఆదేశాలు Read more

Ranya Rao : విడిగా ఉంటున్నామని కోర్టుకు తెలిపిన రన్యా రావు భర్త
Ranya Rao విడిగా ఉంటున్నామని కోర్టుకు తెలిపిన రన్యా రావు భర్త

Ranya Rao : విడిగా ఉంటున్నామని కోర్టుకు తెలిపిన రన్యా రావు భర్త కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి కోర్టుకు కీలక సమాచారం Read more

లాలూ ప్రతిపాదనను తిరస్కరించిన నితీష్
లాలూ ప్రతిపాదనను తిరస్కరించిన నితీష్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జెడి (రాష్ట్రీయ జనతాదళ్) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆయన, గతంలో రెండు సార్లు పొరపాటున దారి తప్పినప్పటికీ, Read more

×