foodvikarabad

భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు

భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు

-15 మంది విద్యార్థినులను ఆసుపత్రి కి తరలింపు

— తాండూరు గిరిజన వసతిగృహంలో ఘటన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, ప్రభాతవార్త: వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినిలు అనుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయిపూర్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా హాస్టల్ భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులతో పాటు అడ్డదిడ్డంగా వంటకాలు చేస్తున్నారని, పరిశుభ్రత పాటించడం లేదని విద్యార్థినులు ఆరోపించాడు. నీళ్ళ వారు తప్ప ఇతర కూరగాయల రుచి ఎరుగమని, కిచెన్లో సైతం అపరిశుభ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి వండిన భోజనం తినలేకపోయామని వాపోయారు. భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యావని, హాస్టల్ టీచర్ మంగళవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అస్వస్థతకు గురైన వారిని తరలించినట్లు విద్యార్థినులు తెలిపాడు. దాదాపు 15 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పంధించి తగు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Posts
రథ సప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Ratha Saptami.. Devotees fl

రథ సప్తమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఈ పర్వదినాన్ని సూర్య భగవానుని జన్మదినంగా పూజిస్తూ, విశేష ఆరాధనలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ Read more

విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి – ఏపీ సర్కార్ ఆదేశం
Teacher should have lunch with students AP Govt

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం మంగళవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 'ఫుడ్ ను తనిఖీ Read more

యూఎస్‌లో కొత్త ఎంపాక్స్ వేరియంట్ కేసు: ఆరోగ్య అధికారులు జాగ్రత్తలు
mpox

యూఎస్‌లో ఎంపాక్స్ అనే అరుదైన వ్యాధి కొత్త వేరియంట్‌తో మొదటిసారి గుర్తించబడింది. ఈ వ్యాధి స్మాల్ పాక్స్ (Smallpox) వైరస్ కుటుంబానికి చెందినది, మరియు ఇది మనిషికి Read more

ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?
ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?

ఢిల్లీలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఎదురుదెబ్బ ఎదుర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితం చేసిన Read more