soaps price

భారీగా పెరగబోతున్న సబ్బుల ధరలు

‘ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. నాగన్నా.. ధరలు మీద ధరలు పెరిగె నాగులో నాగన్న’ అనే ఆర్. నారాయణమూర్తి సినిమాలో పాట ఎంత మందికి గుర్తుంది. ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు అలాగే మారాయి. పప్పులు, ఉప్పు, వంటనూనె వంటి ధరలు ఆకాశానికి పరుగులు పెడుతుండడంతో ప్రజలు బతుకెళ్లదీయలేక పడుతున్న పాట్లు అన్నీఇన్నీ.. కాదు. ఇలా గ్రామాల్లో ఉపాధిలేక నగరాలకు వలసొచ్చిన వేతన జీవులు అధిక ధరలతో పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రస్తుతం మార్కెట్ లో ఏది కొందామన్నా వామ్మో అనుకునేలా మారాయి. జేబు నుండి డబ్బు తీసుకోని పోయిన..కనీసం చేతిలో పట్టుకునే సామాన్లు కూడా రావడం లేదు.

ప్రజల సమస్యలు ఇలా ఉంటే వ్యాపారులు బాధలు మరోలా ఉన్నాయి. ఏ రోజుకి ఏ ధర ఉంటుందో తెలియట్లేదని, ఒకేసారి ఎక్కువ మోతాదులో సరుకులు కొనుగోలు చేస్తే.. ఒకవేళ వాటి ధరలు తగ్గితే తాము నష్టపోతామనే భయంలో ఉన్నామని చెబుతున్నారు. ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కొనుగోలు చేసే సరుకులు మోతాదు తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తమ వ్యాపారాలు దెబ్బుతింటున్నాయని వాపోతున్నారు. రోజువారీ కూలీ చేసుకునే వారికి చేతి నిండా పనులు దొరకడం లేదు. దీనికితోడు నిత్యావసరాల ధరలు నెలల వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. దీంతో కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కూలీ పనులు, ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే.. పప్పు, ఉప్పు, వంటనూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాము ఏమి తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా జీవనం సాఫీగా సాగడం లేదని మధ్యతరగతి ప్రజలు చెబుతున్నారు.

తాజాగా సబ్బుల ధరలు కూడా ఆకాశానికి తాకుతున్నాయి.ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు వీప్రో మరియు హెచ్‌యూఎల్ (హిందూస్థాన్ యూనిలివర్) సబ్బుల ధరలను 7-8 శాతం పెంచాయి. ఇందుకు ప్రధాన కారణం పాల్మ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరగడమే. HUL, విప్రో లాంటి FMCG కంపెనీలు సంతూర్, డవ్, లక్స్, లైఫ్ బాయ్, లిరిల్, పియర్స్, రెక్సోనా తదితర సబ్బుల ధరలను పెంచాయి. ముడి సరుకైన పామ్ ఆయిల్ ధరలు 35-40 శాతం పెరగడంతో సబ్బుల రేట్లను 7-8% పెంచుతున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. వీటితో పాటు టీ, స్కిన్ క్లీనింగ్ ఉత్పత్తుల రేట్లు సైతం పెరిగాయి.పాల్మ్ ఆయిల్ అనేది సబ్బుల తయారీలో ముఖ్యమైన పదార్ధం. ఇది ఉత్పత్తి ఖర్చులను నేరుగా ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం వల్ల కంపెనీలు తమ ఉత్పత్తులపై ధరలు పెంచాల్సిన అవసరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కాఫీ, టీ పౌడర్ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే.

Related Posts
భారత్ కు బయల్దేరిన మోదీ.
భారత్ కు బయల్దేరిన మోదీ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 12, 13) జరిగిన ఈ పర్యటన అనంతరం మోదీ స్వదేశానికి తిరుగు Read more

అమరావతికి 11 వేల కోట్లు ఆమోదించిన హడ్కో
అమరావతికి 11 వేల కోట్లు ఆమోదించిన హడ్కో

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ Read more

పురోహితులకు నెలకు రూ.18వేలు : కేజ్రీవాల్
18 thousand per month for priests.. Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో నిర్వహించబోతున్నారు. ఈక్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇటీవలే మహిళలు, వృద్ధులకు Read more

తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు
తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు

సైబర్ మోసగాళ్లు భయం, దురాశ లేదా ఉత్సుకత వంటి లక్ష్యాల మానసిక దుర్బలత్వాలను అర్థం చేసుకుని, వాటిని తమ ప్రయోజనానికి వినియోగిస్తున్నారు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ Read more