army

భారత వాయు సేనలో అగ్నివీర్ ల నియామకాలు

భారత వాయుసేన నియామక ప్రకటన విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా చేపట్టే ఈ నియామకం నాలుగేళ్లకు మాత్రమే పరిమితం. ఇంటర్, తత్సమాన కోర్సులు పూర్తిచేసిన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వాయుసేన తెలిపింది. ఎంపికైన అభ్యర్థులను అగ్నివీర్ లుగా వ్యవహరిస్తారు. నాలుగేళ్ల పాటు వాయుసేనలో సేవలందించాల్సి ఉంటుంది. పరిమిత కాలం నియామకమే అయినప్పటికీ శారీరక, మానసిక సామర్థ్యాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు తెలిపారు.
జనవరి 7 నుంచి దరఖాస్తు
అగ్నివీర్ ల నియామకానికి సంబంధించి వాయు సేన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 27 తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి వాయుసేన అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in/AV/ లో సంప్రదించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చిలో పరీక్ష నిర్వహించి నవంబర్ లో తుది ఫలితాలను ప్రకటిస్తారు.
పోస్టులు: అగ్నివీర్ వాయు
విద్యార్హత: కనీసం 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్/ తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్
వయోపరిమితి: 1-1-2005 నుంచి 1-07-2008 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు రుసుం: రూ. 500

Related Posts
యజమానిని కాపాడేందుకు బలయిన కుక్క
యజమానిని కాపాడేందుకు బలయిన కుక్క

యజమాని కోసం ప్రాణత్యాగం చేసిన జర్మన్ షెఫర్డ్.శునకాలు విశ్వాసానికి మారుపేరు. ఇవి యజమాని పట్ల విశ్వాసంతో ఉంటూ నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటి Read more

ఆన్‌లైన్ భద్రతకు ప్రమాదం: 78% పాస్‌వర్డ్స్ ఇప్పుడు 1 సెకన్లో క్రాక్ అవుతాయి!
password1

ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్ భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు వెలుగు చూసాయి. తాజాగా, నార్డ్‌పాస్ (NordPass) అనే సంస్థ చేసిన ఒక అధ్యయనంలో, ‘123456’ పాస్‌వర్డ్ ఇండియాలో అతి Read more

మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం
woman constable

యూపీ లోని కాన్పూర్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం జరిగింది. అయోధ్యలో విధులు నిర్వహిస్తున్న 34 సంవత్సరాల మహిళా కానిస్టేబుల్ కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పూర్ బయలుదేరారు. Read more

మోదీని ఓడించే కుట్రలో వీణా రెడ్డి పాత్రపై అనుమానాలు
మోదీని ఓడించే కుట్రలో వీణా రెడ్డి పాత్రపై అనుమానాలు

అగ్రరాజ్యం అమెరికాకు స్వప్రయోజనాలే పరమావధి. దీని కోసం ఏ స్థాయికన్నా దిగజారుతుంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టిన సంచలన విషయాలతో మరోసారి ఇది నిజమేనని Read more