ys sharmila

భక్తులు దర్శనం కోసం వస్తే వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్‌ షర్మిల

వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతికి వస్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని ట్విటర్‌లో పేర్కొన్నారు.
గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష ఆర్తనాదాలు వినిపించాయని అన్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు.

తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని, వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related Posts
విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ ప్రకటన కలకలం
vizag drags case

విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినట్టు ఆరోపణలపై గతంలో పెద్ద చర్చ జరిగింది. ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. Read more

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..!
sabarimalarailways1

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..! గుంతకల్లు రైల్వే, డిసెంబరు 10, ప్రభాతవార్త కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వాముల వారి దర్శనార్థం తెలుగు Read more

తీరని వెత…. డోలిమోత
vizag1

-- ప్రభుత్వాలు మారినా మారని ఆడబిడ్డల తలరాతవిశాఖపట్నం : ఈ కథ కొత్తది కాదు.. నిర్లక్ష్యపు గర్భంలో పూడుకుపోయిన పాత కథ.. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, Read more

ఇన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్నారా..?: చంద్రబాబు
Are there Telugu people in all these countries?: Chandrababu

జ్యూరిచ్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్‌ చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామిక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *