కొత్త బంగారు లోకం సినిమాకు ఆ స్టార్ హీరో ఫస్ట్ ఛాయిస్..

బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయిన హీరో ఎవరంటే..

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటనలో కీలకమైన మలుపు తీసుకొచ్చిన సినిమా కొత్త బంగారు లోకం.హ్యాపీ డేస్ తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ హీరో, వెంటనే కొత్త బంగారు లోకం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.కానీ ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో, వరుణ్ సందేశ్ కెరీర్ కాస్తా నిలకడగా సాగింది.2008లో విడుదలైన కొత్త బంగారు లోకం టాలీవుడ్‌లో ఒక అద్భుతమైన ప్రేమకథగా నిలిచింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా మెప్పించారు.

kota bangaru lokam
kota bangaru lokam

కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో సాగే కథతో యూత్‌ను ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను మలిచారు. సినిమాను విడుదల సమయంలో పెద్దగా అంచనాలు లేకపోయినా, ఈ చిత్రం థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు ఆడియన్స్‌ను బాగా ఆకర్షించాయి.ముఖ్యంగా వరుణ్ సందేశ్ మేనరిజం అప్పట్లో యూత్‌లో విపరీతమైన ఆదరణ పొందింది.మరోవైపు హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ తన ముద్దు ముద్దు నటనతో కుర్రకారును కట్టిపడేసింది.

ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే, ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తూ ఆనందిస్తారు.ఈ సినిమాకు మొదటి ఎంపిక వరుణ్ సందేశ్ కాదు అనే విషయం ఆసక్తికరమైనది.ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మొదటగా అక్కినేని నాగచైతన్యను హీరోగా ఎంచుకున్నారు.నాగచైతన్య కోసం నాగార్జునను సంప్రదించినప్పుడు, కథ బాగుంది కానీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉంటే మరింత బాగుంటుందనే సూచన అందించారు.దీంతో చైతన్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మరో హీరోను సంప్రదించినా, చివరకు ఈ అవకాశం వరుణ్ సందేశ్‌కు లభించింది.తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కొత్త బంగారు లోకం ఊహించని విజయాన్ని అందుకుంది. యూత్‌ను ఎంతగానో అలరించిన ఈ చిత్రం అప్పటి ట్రెండ్స్‌ను సృష్టించింది. ఈ సినిమా ద్వారా వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Related Posts
సినిమా తీయనున్న అమ్మడు సమంత
సినిమా తీయనున్న అమ్మడు సమంత.

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె గురించి వినిపిస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ Read more

మొత్తానికి రామ్ మరో సినిమా స్టార్ట్ చేశాడు
rapo 22 ram pothineni

టాలీవుడ్ యువ హీరోలలో డాన్స్, యాక్టింగ్, అందం వంటి అన్ని విషయాల్లో అగ్రగామిగా నిలిచే నటుడు రామ్ పోతినేని. అతని టాలెంట్‌ ను చాలామంది అభినందిస్తుంటారు. కానీ, Read more

David Warner: రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ ఎన్ని కోట్లు తీసుకున్నాడు?
David Warner: రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ ఎన్ని కోట్లు తీసుకున్నాడు?

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు తెలుగువారిలో విపరీతమైన అభిమానంతో పాటు, స్పెషల్ క్రేజ్ కూడా ఉంది. అందుకు ప్రధాన కారణం ఆయన ఐపీఎల్‌లో సన్ రైజర్స్ Read more

మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి సంబరాలు
అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన,

దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.అన్ని వయసుల వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సంబరాల్లో Read more