Five year old Aryan

బోరుబావిలో పడ్డ బాలుడు మృతి

రాజస్థాన్ , డిసెంబర్ 12,బోరుబావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు రెండు రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. విషాదకర సంఘటనగా మిగిలిపోయిన బాలుడి ఉదంతం రాజస్థాన్ లో జరిగింది. దీనికి సంబందించి పూర్తి వివరాలు..గత రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ బాలుడి ప్రాణాలను కాపాడేందుకు అధికారులు విశ్వాప్రయత్నాలు చేసారు. ప్రమాదవశాత్తు 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడుని 56 గంటల తర్వాత బయటకు తీసినప్పటికీ, ప్రాణాలు మాత్రం దక్కలేదు. రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిందీ ఘటన.

Advertisements

మూడు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. గంట తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. పైపు ద్వారా ఆక్సిజన్‌ను లోపలికి పంపారు. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లోపలికి కెమెరాను కూడా పంపారు. ఎస్‌డీఆర్ఎఫ్‌తోపాటు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. బోరుబావిలో చిక్కుకుపోయిన బాలుడు ఆర్యన్‌ను రక్షించేందుకు రెండ్రోజులపాటు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించినప్పటికీ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కలేదు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని తాడు సాయంతో బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

నీటి కోసం బోరుబావి తీసినపుడు అందులో నీరు రాకపోతే వెంటనే వాటిని పూడ్చివేయాలని కోర్టులు ఎన్నిసార్లు ఆజ్ఞాపించిన ప్రజల్లో చేంజ్ రావడం లేదు. తాజాగా రాజస్థాన్ లోని ఆర్యన్ మరణించాడు.ఆర్యన్ ను రక్షించేందుకు అధికారులు బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వారు. అయితే, డ్రిల్లింగ్ మెషీన్ పాడవడం, 160 అడుగుల లోతులో నీరు పడే అవకాశం ఉండడంతో బాలుడిని రక్షించేందుకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. ఇంకా తవ్వుకుంటూ పోతే బాలుడిపై మట్టిపెళ్లలు పడే అవకాశం ఉండడంతో చివరికి బాలుడి చుట్టూ తాడు కట్టి జాగ్రత్తగా బయటకు లాగారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఈసంఘటతోనైనా మనము మార్పు చెందుదాం.

Related Posts
డీప్‌సీక్ యాప్ డౌన్‌లోడ్ చేస్తే జైలు శిక్ష
deepseek

కృత్రిమ మేధస్సులో చైనా ప్రభావాన్ని అరికట్టడానికి అమెరికా సెనేటర్ జోష్ హాలే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఆమోదం పొందితే డీప్‌సీక్ వంటి చైనా అభివృద్ధి Read more

తిరుమల భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి
tirumala devotees

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తుల ఆరోగ్యంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక సూచనలు జారీ చేసింది. ఇటీవల కాలంలో గుండె సంబంధిత ఆరోగ్య Read more

Pahalgam Attack: వారంలోగా దేశాన్ని వదిలి వెళ్ళండి – పాక్ దౌత్యవేత్యకు భారత్ సమన్లు
వారంలోగా దేశాన్ని వదిలి వెళ్ళండి - పాక్ దౌత్యవేత్యకు భారత్ సమన్లు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించిన భారత్​, తాజాగా దిల్లీలోని పాక్‌ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్‌ దౌత్యవేత్త సాద్‌ Read more

AP DSC 2025: ఏపీ డీఎస్సీ దరఖాస్తులో కీలక మార్పు
AP DSC 2025: ఏపీ డీఎస్సీ దరఖాస్తులో కీలక మార్పు

ఏపీలో మెగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది 2025 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటోంది. Read more

Advertisements
×