Relief for battalion consta

బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు ఊరట..

తెలంగాణ బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల నిరసనలు ఫలవంతమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన సెలవుల జీవో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, ఈ ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు ఆందోళనలు ప్రారంభించారు. ఇంతకుముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు 15 రోజులకు ఒకసారి సెలవుపై ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది. కానీ, కొత్త జీవో ప్రకారం 26 రోజులకు ఒకసారి మాత్రమే సెలవు మంజూరు చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంది.

ఈ జీవోపై బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసన చేపట్టి, పలు బెటాలియన్ల ముందు ధర్నాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ స్పెషల్‌ అదనపు డీజీపీ తాజా ఉత్తర్వులను జారీ చేయడంతో ప్రభుత్వం తాత్కాలికంగా జీవోను నిలిపివేసింది. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయంతో దిగొచ్చి, తాత్కాలికంగా కుటుంబాలకు ఊరట కల్పించడంతో కానిస్టేబుళ్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

Related Posts
‘గ్రోమర్ రైతు సంబరాలు’.. రైతుల కష్టాన్ని గౌరవించిన కోరమాండల్ ఇంటర్నేషనల్
'Growmer Farmer Celebrations'.. Coromandel International

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన మెగా లక్కీ డ్రా విజేతలకు ట్రాక్టర్లు మరియు మోటర్ సైకిళ్లను బహుకరించారు.. హైదరాబాద్ : భారతదేశంలోని సుప్రసిద్ధ వ్యవసాయ పరిష్కారాల ప్రదాత Read more

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే
Former MLA Koneru Konappa said goodbye to Congress

స్వతంత్రంగా ఉంటానని ప్రకటించిన కోనేరు కోనప్ప హైదరాబాద్‌: బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప.. కొన్ని నెలలకే ఆ పార్టీకి గుడ్ Read more

ఆస్తి పన్ను వెంటనే చెల్లించండి లేకపోతె ఆస్తులకే ఎసరు.
ఆస్తి పన్ను వెంటనే చెల్లించండి లేకపోతె ఆస్తులకే ఎసరు.

జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరుకుపోయిన పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ పన్ను బకాయిలపై ఉక్కుపాదం మోపుతోంది. మొండి బకాయిదారులపై కొరడా ఝళిపిస్తూ చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం Read more

స్వీడన్, నార్వే యుద్ధానికి సిద్ధం: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం ఎలా మారిపోతుంది?
NATO

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు యుకె ప్రధాని కీర్ స్టార్మర్ ఉక్రెయిన్‌ను శక్తివంతమైన ఆయుధాలతో సన్నద్ధం చేసేందుకు ATACMS మరియు స్టార్మ్ షాడో ఆయుధ వ్యవస్థలను Read more