lovers suicide

బిల్డింగ్ పై నుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత కుటుంబాలు బతుకుదెరువు కోసం విశాఖపట్నానికి వలస వచ్చి షీలానగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాయి. సుష్మిత, దుర్గారావు మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు కలిసి జీవితం గడపాలని నిర్ణయించుకున్నప్పటికీ, వారి ఇళ్లలో పెళ్లి విషయంపై ప్రస్తావన తీసుకురాగా కుటుంబాల నుంచి నిరాకరణ ఎదురైంది. ఈ నిరాకరణ వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.

ఈ క్రమంలో వారిద్దరూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవించే అవకాశం లేదని..కలిసి చనిపోదామని చెప్పి ఓ అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కిరెడ్డిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు కుటుంబ సభ్యుల మధ్య ఉత్పన్నమైన ఒత్తిళ్లు కారణమా లేదా ఇతర కారణాలా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
75వ రాజ్యాంగ వార్షికోత్సవం గురించి మోదీ ప్రసంగం – దేశ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు!
Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తన ప్రసంగంలో.. "ఈ పార్లమెంటు సెషన్ అత్యంత ప్రత్యేకమైనది. 75 సంవత్సరాల క్షేత్రంలో Read more

వైఎస్‌ఆర్‌సీపీ-టీడీపీ మధ్య ఉద్రికత్తలు..మాజీ మంత్రి అప్పలరాజు గృహ నిర్బంధం
Tensions between YSRCP TDP.Former minister Appalaraju under house arrest

అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ-పలాసలో వైస్‌ఆర్‌సీపీ మరియు టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు Read more

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు
20 killed 30 injured in ra

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జరిగిన భారీ పేలుడులో మృతుల సంఖ్య 20కి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దారుణ ఘటనలో దాదాపు 40 Read more

తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బరిలో 90మంది
Telangana MLC nomo

మెదక్ నియోజకవర్గం కోసం 56 మంది అభ్యర్థులు పోటీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *