NBK109 title

బాలయ్య ఫ్యాన్స్ పూనకాలు సిద్ధంగా ఉండండి..

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి రేపు (నవనార్ 15) టైటిల్ & టీజర్ విడుదల కాబోతుంది. నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదిప్పుడు. ఒకడు నాకెదురొచ్చినా.. నేను ఒకడికి ఎదురొచ్చినా రిస్క్ నీకే అన్నట్లుంది ఆయన దూకుడు. వరస విజయాలు.. మరోవైపు రాజకీయాలు.. ఇంకోవైపు అన్‌స్టాపబుల్ షో.. ఇలా బాలయ్యకు తిరుగేలేదిప్పుడు. వరుస విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన సినిమాలకు భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.

‘అఖండ ,’ ‘వీరసింహారెడ్డి,‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ ..ఇప్పుడు ‘NBK 109’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఎప్పటినుండో అభిమానులు ఈ సినిమా టైటిల్ ఏంటనే టెన్షన్ లో ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, యాక్షన్ గ్లింప్సెస్ తో బాలయ్య తన మాస్ లుక్ లో అదరగొడతారని అర్థమైంది. అలాగే, ఈ చిత్రంలో బాలయ్యను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించేందుకు బాబీ ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్.

కాగా రేపు శుక్రవారం ఉదయం 10.24 గంటలకు ఈ మూవీ టీజర్ వీడియో రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించి అభిమానుల్లో జోష్ పెంచారు. నిర్మాత నాగవంశీ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు. ‘రేపు వచ్చే అదిరిపోయే BGM కోసం సిద్ధంగా ఉండండి. బాలయ్య బాబు సినిమాలకు తమన్ ఎందుకు మ్యూజిక్ అందించాలో మీకే తెలుస్తుంది’ అని చేసిన ట్వీట్ అంచనాలను పెంచేసింది. సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తారని తెలుస్తోంది.

Related Posts
రామ్మూర్తి నాయుడు మృతికి ప్రధాని సంతాపం..నారా రోహిత్‌కు లేఖ
PM Modi condolence letter to Nara Rohit on death of Rammurthy Naidu

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. మొన్న Read more

అల్లుఅర్జున్ జైల్లో ఓ రాత్రి
Allu Arjun Reaching Jubilee Hills Residence 380x214

అల్లుఅర్జున్ జైల్లో రాత్రి భోజనం చేయకుండా నిద్రించినట్లు తెలిసింది. రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లుఅర్జున్ను ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్కు తరలించారు. జైలు అధికారులు Read more

3rd day ప్రదీప్ రంగనాథన్ మ్యాజిక్ – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హిట్ టాక్
1 (బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - వీకెండ్ కలెక్షన్లు అదుర్స్)

సినిమా స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు మరోసారి 2 కోట్లకు పైగానే గ్రాస్ మార్క్. 3rd day ప్రదీప్ రంగనాథన్ మ్యాజిక్ – రిటర్న్ ఆఫ్ Read more

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సుమన్
suman bcm

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శుక్రవారం సినీ నటుడు సుమన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు సుమన్ను ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం Read more