vivek oberoi

ప్రేమ పెళ్లిపై నిర్ణయాలు మారాయి బాలీవుడ్ హీరో.

వివేక్ ఒబెరాయ్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించిన ఆయన, రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచిన ఈ నటుడు,కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకుల తర్వాత కొత్త ఆశతో ముందుకు సాగుతున్నారు. తన జీవితంలోని తొలిప్రేమ గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఓపికగా మాట్లాడారు.13 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాను. ఆమె నాకంటే ఏడాది చిన్నది. 18 సంవత్సరాల వయసులోనప్పుడు,ఆమెతో నా భవిష్యత్తు గురించి కలలు కన్నారు.పెళ్లి, పిల్లలు అన్నీ ఊహించుకున్నాను, అని చెప్పారు.కానీ,ఈ ప్రేమకథ దురదృష్టవశాత్తు విషాదాంతమైంది.ఒకరోజు ఆమె ఆరోగ్యం సరిగాలేదని చెప్పింది.జ్వరం అనుకున్నాను, విశ్రాంతి తీసుకుని తిరిగి వస్తుందని భావించాను.కానీ, ఆమె పలకరించలేదు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆమె బంధువులకు ఫోన్ చేయగా, ఆసుపత్రిలో ఉందని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లినప్పుడు తెలిసింది,ఆమెకు క్యాన్సర్ చివరి దశలో ఉందని.

ఆసుపత్రిలో బెడ్‌పై ఆమెను చూసి తట్టుకోలేకపోయాను.రెండు నెలల్లోనే ఆమె కన్నుమూసింది,” అని వివేక్ భావోద్వేగంతో చెప్పుకున్నారు.ఆ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని,ఆ బాధను మరిచి మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు.ఈ అనుభవం తనను క్యాన్సర్ బాధిత చిన్నారులకు సహాయం చేయాలనే ఆలోచనకు ప్రేరేపించిందని తెలిపారు.తొలి ప్రేమ విషాదాంతం తర్వాత, వివేక్ జీవితంలో మరికొన్ని ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి. ఈ కారణంగా ఒక దశలో పెళ్లి చేసుకోకూడదని కూడా నిర్ణయించుకున్నానని వెల్లడించారు. కానీ కుటుంబసభ్యుల ఒత్తిడి వల్ల ప్రియాంకను కలిశానని, ఆమెతో 2010లో వివాహం జరిగిందని చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ తగ్గినా, వివేక్ తన నటనపై ఉన్న ప్రేమతో కొత్త అవకాశాల కోసం కృషి చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాలలోను నటిస్తూ తనకంటూ కొత్త మార్కెట్‌ను సృష్టించుకున్నారు.

Related Posts
Nandamuri Tarakaratna : తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. కుందనపు బొమ్మలా ఎంత బాగుందో
Nishka half saree ceremony

నందమూరి తారకరత్న అనే పేరు వినగానే ఆయన జీవితంలో అనేకమైన జ్ఞాపకాలు మెదలుతాయి. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఈ యువ హీరో, కేవలం 39 ఏళ్ల Read more

నకిలీ ప్రచారాలు ఎక్కువైతున్నాయి అంటూ.ప్రకాశ్ రాజ్
నకిలీ ప్రచారాలు ఎక్కువైతున్నాయి అంటూ.ప్రకాశ్ రాజ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, ఫోటోలు పెరిగిపోతున్నాయి. వాటిని సరైన దృష్టితో చూడకపోతే, చాలా మంది నకిలీ ఫోటోలపై నమ్మకం పెంచి తప్పు వార్తలను పంచుకుంటున్నారు. Read more

ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్
ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్

ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్ కొంత మంది హీరోలకు సినిమా టైటిల్ ఫిక్స్ చేయడం పెద్ద సవాల్‌గా మారుతుంది.షూటింగ్ చివరిదశలో ఉన్నా సరైన పేరు Read more

Tollywood: సిల్వర్‌ స్క్రీన్‌ మీద జేసీ దివాకర్‌రెడ్డి జీవితం.. ఆయన పాత్రలో టాలీవుడ్ ప్రముఖ యాక్టర్
jc diwakar reddy

ఇప్పుడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి హవా నడుస్తోందన్నది అందరికీ తెలిసిందే కానీ ఒకప్పుడు ఆయన తమ్ముడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాల్లో ఒక పెద్ద సెన్సేషన్‌ అని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *