దేశం అంతా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. వాటిలో ఒక ముఖ్యమైనది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని రామదుర్గం చర్చి.ఈ చర్చి 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.ఇది ఆలూరు మండలంలో ఉన్న ఒక పాత చర్చి, దీనికి ఎంతో ప్రత్యేకమైన వర్ణన కూడా ఉంది. 1780లో ఫాదర్ సెయింట్ రామదుర్గం చర్చిని గోవా రిజిస్టర్‌లో నమోదు చేశారు.అప్పటి నుండి ఈ చర్చి,ప్రాంతీయ ప్రజలకు మానవ సేవలు అందిస్తూ పెరిగింది.150 సంవత్సరాల క్రితం, ఆదోని ప్రాంతానికి చెందిన మినుములు చిన్న నాగప్ప,పెద్ద నాగప్ప ఇద్దరు రాయచూరు వెళ్లి అక్కడి క్రైస్తవ గురువును కలుసుకున్నారు.ఆయన బోధనలతో క్రైస్తవ మతాన్ని అంగీకరించి,రామదుర్గం గ్రామంలో పునీత అన్నమ్మ చర్చిని నిర్మించారు.ఈ చర్చిలో సేవలందించిన ఫాదర్స్, విదేశాల నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీలు ప్రజలకు విద్య, వైద్యం,ఆహారం వంటి సేవలనుఅందించారు.డైనవేర్మూలిన్ అనే ఫాదర్ ప్రత్యేకంగా రామదుర్గం చర్చిలో స్థిరపడి,ప్రాముఖ్యమైన సేవలు ప్రారంభించారు.కరువు కాలంలో ప్రజలకు ఆహారాన్ని అందించడం,శిక్షణ మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయన జనమునకు సహాయం చేశారు.ఇప్పుడు,రామదుర్గం చర్చి తన ప్రాచీన నిర్మాణంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
రాతి కట్టతో నిర్మించబడిన ఈ చర్చి చుట్టూ అద్భుతమైన వాతావరణం ఏర్పడింది.గతంలో ఈ ప్రాంతం పాలనా సౌలభ్యం కోసం మారింది,కానీ ఇప్పటికీ ఈ చర్చి అనేక సేవలను అందిస్తుంది.చిప్పగిరి గ్రామంలో 1.5 కోట్ల రూపాయల వ్యయంతో ఫాతిమా ఆర్సిఎం అనే పాఠశాలను నిర్మించారు.ఈ పాఠశాల ఫాదర్‌లకు మరియు విద్యార్థులకు మంచి స్థానం కల్పిస్తోంది.రామదుర్గం గ్రామానికి చెందిన 13 మంది ఫాదర్లు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మత బోధన చేస్తున్నారు. క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి.రామదుర్గం చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపు, అన్నదానం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ వేడుకలు ఐదు రోజులపాటు కొనసాగనుండగా, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ క్రిస్మస్ వేడుకలు మరింత వైభవంగా జరుగుతాయి.