world oldest man john alfre

ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జాన్ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో 1912 ఆగస్టు 26న జన్మించిన టిన్నిస్‌వుడ్.. షెల్, బీపీ కంపెనీల్లో అకౌంటెంట్‌గా పనిచేసి1972లో ఉద్యోగ విరమణ పొందారు.

Advertisements

ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకున్న జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ గిన్నిస్‌ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. సౌత్‌పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆయనకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బృందం ఈ ఏడాది ఏప్రిల్​లో సర్టిఫికెట్‌ అందజేసింది. అయితే, సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన అప్పుడు చెప్పడం గమనార్హం. చారిత్రక విషాదమైన టైటానిక్‌ ఓడ మునిగిన 1912లో జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ జన్మించారు. టైటానిక్‌ నౌక మునిగిన కొన్ని రోజులకే పుట్టిన ఆయన తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన, ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ జీవన విధానమే కారణమని చెప్పేవారు.

జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ అలవాట్ల విషయానికి వస్తే..ఎప్పుడూ ధూమపానం చేయలేదు. మద్యం మాత్రం అప్పుడప్పుడు తీసుకునేవారు. ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్‌ తీసుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి డైట్‌ పాటించలేదు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. భార్య బ్లాడ్వెన్ 1986లోనే మరణించారు.

Related Posts
భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన
భూగర్భజలాలపై కేటీఆర్ ఆందోళన

తెలంగాణలో భూగర్భజల మట్టాలు పడిపోతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగు నెలల్లోనే భూగర్భజల మట్టం Read more

వడ్డీ రేట్లను తగ్గిచం: ట్రంప్
విదేశీ విద్యార్ధుల ఓపీటీ రద్దుకు ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు!

గడచిన కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లతో పాటు పెట్టుబడిదారులు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ పాలసీ రేట్ల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి కారణం ట్రంప్ Read more

సింగిల్ పేరెంట్ గా లైఫ్ ఎలా ఉంది..? సానియా చెప్పిన సమాధానం ఇదే..!
sania mirza son

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ గత ఏడాది జనవరిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల తర్వాత సానియా తన Read more

సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌
Delhi Ex CM Arvind Kejriwal Vacates Official Home With Family

Delhi Ex-CM Arvind Kejriwal Vacates Official Home With Family న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి Read more

Advertisements
×