earthquake

ప్ర‌కాశం జిల్లాలో మళ్ళీ భూప్ర‌కంప‌న‌లు

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా భూప్ర‌కంప‌న‌లు రావ‌డం ఇది వ‌రుస‌గా మూడో రోజు. శ‌ని, ఆది వారాల్లో కూడా ఇలాగే భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో జిల్లా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు.
స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ నుంచి భయంతో పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.
ఈరోజు భూమి కంపించిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అస‌లేం జ‌రుగుతోందో అర్థం కావ‌ట్లేద‌ని స్థానికులు వాపోతున్నారు. మరింత భూప్ర‌కంప‌న‌లు రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related Posts
ఏపీ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం
chandrababu

ఏడాది చివరి రోజున ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న Read more

విచారణకు హాజరైన పేర్ని జయసుధ
jayasuda police22

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలుకా Read more

“సరస్వతి పవర్” భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరియు ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల Read more

నోటిదూల..పృథ్వీపై బండ్ల గణేష్ కౌంటర్
నోటిదూల..పృథ్వీపై బండ్ల గణేష్ కౌంటర్

సినిమా ఈవెంట్స్‌లో రాజకీయాలు మింగుడు పడవు! ఈ వివాదం సినీ ప్రముఖులకు ఒక గుణపాఠంగా మారింది. సినిమా వేదికలపై రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా ఉండటం అత్యవసరం. బండ్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *