manchu manoj

పోలీసుల సూచనలతో వెనుతిరిగిన మంచు మనోజ్‌

మోహన్‌బాబు, మంచు మనోజ్‌ల మధ్య రోజుకో మలుపు తిరుగుతూ జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిన్న తిరుపతిలోని మోహన్‌బాబుకు చెందిన వర్సిటీకి మంచు మనోజ్‌ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. చివరకు పోలీసులు జరిపిన చర్చలతో మంచు మనోజ్‌ తన తాత, నాయనమ్మ సమాధుల వద్ద నివాళి అర్పించి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. అయితే తనపై, తన భార్య మౌనికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారంటూ చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌కు పోలీసులు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.

అనంతరం ఆయన పోలీసు స్టేషన్‌ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఎవరితో గొడవ పెట్టడానికి రాలేదని, సంక్రాంతి పండుగను కూతురుతో కలిసి జరుపుకుందామని వచ్చానని తెలిపారు. అయితే రెండు రోజుల పాటు తనను పండుగను జరుపుకోకుండా ఆటంకాలు సృష్టించారని మీడియాకు వివరించారు.తాను తిరుపతికి వస్తున్న సందర్భంగా తన అభిమానులు ఏర్పాటుచేసిన బ్యానర్లను చించివేయడం, అభిమానులను బెదిరించడం సరికాదని అన్నారు. ఫ్యాన్స్‌ను బెదిరించకుండా ఉంటే సైలెంట్‌గా ఉండేవాడినని తెలిపారు. తన కుటుంబ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో గాని, మంత్రి నారా లోకేష్‌, ఎమ్మెల్యే నానికి వివరించ లేదని, సహాయం చేయాలని కూడా ఎవరినీ అడగలేదని వెల్లడించారు.

Related Posts
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి
satyanarayana

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి Read more

స్విగ్గీ బాయ్ కట్ నిర్ణయం వెనక్కి
swiggy ap

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా Read more

ఆంధ్రాకు భారీ ప్రాజెక్ట్: చంద్రబాబు ట్వీట్
chandra babu

దావోస్‌లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. రెండ రోజు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు వరుస Read more

ఏపీ మందుబాబులకు మరో శుభవార్త
Another good news for AP dr

ఏపీ మందుబాబులకు సర్కార్ వరుస గుడ్ న్యూస్ ను అందజేస్తూ కిక్ ను పెంచేస్తుంది. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నిస్తున్నట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *