mohan

పోలీసుల‌కు మోహ‌న్ బాబు గ‌న్ అప్ప‌గింత

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు త‌న లైసెన్స్ గ‌న్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈరోజు హైద‌రాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లోని త‌న యూనివ‌ర్సిటీకి వెళ్లారాయ‌న‌. అనంత‌రం చంద్ర‌గిరి పోలీస్ స్టేష‌న్‌లో త‌న డ‌బుల్ బ్యారెల్‌ లైసెన్స్‌డ్ గ‌న్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవ‌ల కుటుంబ గొడ‌వ‌ల నేప‌థ్యంలో గ‌న్ స‌రెండ‌ర్ చేయాల‌ని హైద‌రాబాద్ పోలీసులు ఆయ‌న్ను ఆదేశించ‌డంతో తాజాగా గ‌న్ అప్ప‌గించారు. మంచు మనోజ, మోహ‌న్ బాబుల మధ్య ఆస్తుల గొడవలు తారస్తాయికి చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. తాజాగా పోలీసులు మోహ‌న్ బాబును గన్ అప్పగించమని ఆ దేశించారు.

మరోసారి క్ష‌మాప‌ణ‌లు

మ‌రోవైపు జ‌ల్‌ప‌ల్లిలో త‌న నివాసం వద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై మోహ‌న్ బాబు తాజాగా మ‌రోసారి మాట్లాడారు. తాను ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌ర్న‌లిస్టుపై దాడి చేయ‌లేద‌న్నారు. ఈ సందర్భంగా మ‌రోసారి జ‌ర్న‌లిస్టుల‌ను ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఇక ఆదివారం నాడు దాడిలో గాయ‌ప‌డిన జ‌ర్న‌లిస్టును ఆసుప‌త్రికి వెళ్లి మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

Related Posts
దక్షిణ కొరియా సరిహద్దును శాశ్వతంగా మూసేస్తాం: కిమ్‌
North Korea vows to permanently block border with southern neighbours

ప్యోగ్యాంగ్‌ : ఉత్తర కొరియా - దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఇరుదేశాల మధ్య Read more

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం
ap land registration

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల Read more

లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్
లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినట్లు Read more

జగన్ కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
vijayasai

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా ఈ మధ్య పార్టీకి వరుసగా గుడ్ బై చెబుతున్న నేతల ప్రస్తావన వచ్చింది. దీనిపై మీడియా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *