virus

పొంచి వున్న మరో వైరస్ ముప్పు?

ఆస్ట్రేలియా, డిసెంబర్ 12,
చైనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందినదని అన్ని దేశాలు ఆరోపించాయి. ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచం ఇంకా కోలుకోకుండానె కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రాణాంతక సజీవ వైరస్‌ నమూనాలు ఉన్న వందలాది వయల్స్ (చిన్న బాటిల్స్) ల్యాబ్ నుంచి అదృశ్యమైనట్టు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. వయల్స్ మాయం ఘటన కలకలం రేపడంతో ఆస్ట్రేలియా ప్రజారోగ్య విభాగంతోపాటు క్వీన్స్‌లాండ్ హెల్త్ శాఖ సంయుక్తంగా దర్యాప్తునకు ఆదేశించాయి. ఈ ఘటనను అతిపెద్ద బయోసెక్యూరిటీ ప్రొటోకాల్స్ ఉల్లంఘనగా ప్రభుత్వం పేర్కొంది.
తాజా నివేదిక ప్రకారం..
బయటకు వచ్చిన నివేదిక ప్రకారం వివిధ రకాల సజీవ వైరస్‌ శాంపిల్స్ కలిగిన 323 వయల్స్ గతేడాది ఆగస్టులో క్వీన్స్‌లాండ్‌లోని పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి మాయమయ్యాయి. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అందరిలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాయమైన వయల్స్‌లో ప్రమాదకర హెండ్రా వైరస్, లిసావైరస్, హంటావైరస్ వంటివి ఉన్నాయి. హెండ్రా అనేది జూనోటిక్ (జంతువుల నుంచి మనుషులకు సోకేది) వైరస్. దీనిని ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో మాత్రమే గుర్తించారు. హంటావైరస్ అనేది వైరస్‌ల కుటుంబాలకు చెందినది. ఇది తీవ్రమైన అనారోగ్యానికి గురిచేయడంతోపాటు మరణానికి కూడా కారణమవుతుంది. ఇక, లిసా వైరస్ అనేది వైరస్‌ ల సమూహానికి చెందినది. ఇది సోకితే రేబిస్ వ్యాధి వస్తుంది.
స్పష్టత లేదు
కనిపించకుండా పోయిన ఈ వయల్స్‌ను ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేదంటే ధ్వంసమయ్యాయా? అన్న విషయంలో స్పష్టత లేదు. వీటివల్ల సమాజానికి పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు.

Related Posts
NewZealand :న్యూజిలాండ్‌లో భారీ భూకంపం హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం
NewZealand :న్యూజిలాండ్‌లో భారీ భూకంపం హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం

న్యూజిలాండ్‌లో రివర్టన్‌ తీరంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జిఎస్) ప్రకటించింది. ఈ ప్రకంపనలు Read more

పాకిస్తాన్‌లో పోలియో వ్యాప్తి: 2024లో 55 కేసులు, సవాలుగా మారిన పరిస్థితి..
pakistan polio cases

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సుల్లో మూడు కొత్త పొలియో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో 2024 సంవత్సరంలో ఇప్పటివరకు పొలియో బాధితుల సంఖ్య Read more

JaiShankar :డాలర్ ను బలహీనపరిచే భావన మాకు లేదు: జైశంకర్
JaiShankar :డాలర్ ను బలహీనపరిచే భావన మాకు లేదు: జైశంకర్

భారతదేశం డాలర్ ని బలహీనపరిచే ప్రయత్నాలు చేయలేదని, బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి కరెన్సీపై భారత్ ప్రమేయం లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టంగా వెల్లడించారు. Read more

మోస్ట్ వాంటెడ్ అబ్దుల్ రెహ్మాన్ మృతి
ముంబై ఉగ్రదాడి కుట్రదారుడి మరణం

ముంబై ఉగ్రదాడి కుట్రదారు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ పాకిస్థాన్‌లో మరణించాడు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఇటీవల కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో Read more