runamafi ponguleti

పొంగులేటి బాంబులన్నీ తుస్సు..తుస్సు..?

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సియోల్ పర్యటన అనంతరం రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు జరగబోతాయని, ముఖ్యంగా ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో సంబంధించిన అంశాల్లో కీలక అరెస్టులు ఉంటాయని పొంగులేటి ప్రకటించారు. దీపావళి సమయంలో బాంబుల్లా పేలుతాయని, ప్రజల ముందు నిజాలు వెలుగులోకి తెస్తామంటూ ఆయన ప్రకటించిన మాటలు ఇప్పుడు విసిరిన వాగ్దానాల్లా మారాయి.

ఆరు రోజుల తరువాత కూడా రాజకీయాల్లో ఎలాంటి పెద్ద పరిణామాలు జరగకపోవడం, ఎలాంటి అరెస్టులు లేకపోవడంతో, ప్రజలు, రాజకీయ నాయకులు పొంగులేటిపై సెటైర్లు వేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు కేవలం పబ్లిసిటీ కోసమేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా పొంగులేటి వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ ఆరోపణలు నిజమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ బాంబులు పేలకపోవడంతో, పొంగులేటి చేసిన వ్యాఖ్యలు “తుస్ పటాకా” అయ్యాయని ట్రోల్ చేస్తున్నారు.

Related Posts
అతిపెద్ద తయారీ సౌకర్యాన్ని చెన్నైలో ప్రారంభించిన నిబావ్ హోమ్ లిఫ్ట్స్
Nibaw Home Lifts opened its largest manufacturing facility in Chennai

• ఈ కొత్త సదుపాయం జోడింపుతో, కంపెనీ మొత్తం ఉత్పత్తి సంవత్సరానికి 15,000 యూనిట్లకు పెరిగింది.• ఈ అత్యాధునిక 1,00,000 చదరపు అడుగుల సదుపాయం చెన్నైలోని SIPCOT, Read more

కేరళ లో ఘోర రోడ్డు ప్రమాదం..మెడికో స్టూడెంట్స్ మృతి
kerala road accident

కేరళలోని అలెప్పి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి భారీ వర్షం సమయంలో వేగంగా వచ్చిన కారు, బస్సును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మెడికో Read more

దావోస్ పర్యటన వివరాలు పంచుకున్న శ్రీధర్ బాబు
sridhar started tea fiber s

తెలంగాణ ప్రభుత్వం దావోస్ సదస్సులో పాల్గొన్నదుకు అనూహ్యమైన విజయాలు సాధించిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈసారి నాలుగు రెట్లు ఎక్కువ ఒప్పందాలు Read more

ఎమ్మెల్సీ క‌విత కాంగ్రెస్, బీజేపీలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Attacks at the instigation of CM Revanth Reddy: MLC Kavitha

కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాలు బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఈ పార్టీలు ప్రజలకు సరైన పాలనను అందించడంలో విఫలమైనాయని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *