పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు

రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు సంబంధించి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.

రేషన్ బియ్యం మాయం కేసు లో వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ కు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో జయసుధకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు సందర్భంగా పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

jayasuda

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.

కాగా రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
బందరు మండలం పోట్లపాలెం సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద.. బఫర్ గోడౌన్ నిర్మించారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని భార్యను వివరణ కోరారు. వే బ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదంటూ.. తొలుత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

Related Posts
చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు – అంబటి
ambati chiru

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిందని చిరంజీవి చేసిన ప్రకటనపై అంబటి Read more

అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ వ్యాఖ్యలు
pawan amazon

అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గిఫ్ట్ కార్డులలో డబ్బు జమ చేయడం చాలా Read more

పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా?
పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉపముఖమంత్రి పదవి చుట్టూ తిరుగుతున్నాయి . ఇన్నాళ్లు పవన్ చేసిన త్యాగాలు , సహాయాలు గుర్తింపు గా పవన్ కు ఉపముఖమంత్రి పదవి ఇచ్చినట్టు Read more

కేఎల్ యూనివర్సిటీ ,న్యాక్ అధికారులు అరెస్ట్?ఎందుకంటే..
కేఎల్ యూనివర్సిటీ ,న్యాక్ అధికారులు అరెస్ట్ ఎందుకంటే

న్యాక్ రేటింగ్ కొరకు అక్రమాలకు పాల్పడిన కేఎల్ యూనివర్సిటీ అధికారులతోపాటు న్యాక్ పర్యవేక్షణ బృందం సభ్యులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *