IMG Perni Nani

పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ లోరేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ తిరిగి 19వ తేదీకి వాయిదా పడింది. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి జరిమానాతో కలిపి డబ్బులు కట్టాలన్న అధికారుల నోటీసుకు స్పందించిన నాని కుటుంబం తొలి విడతలో ఈ నెల 13న కోటి రూపాయల విలువైన మూడు డీడీలు సమర్పించింది. నిన్న మరో రూ. 70 లక్షల డీడీలు ఇచ్చారు. మొత్తంగా రెండు విడతల్లో కలిపి ఇప్పటి వరకు రూ. 1.7 కోట్ల డీడీలు అధికారులకు అందించారు.
నేడు స్పష్టత వచ్చే అవకాశం
అయితే ఈ కేసు పలు మలుపులు తిరుగుతున్నది. జరిమానా చెల్లించే అవకాశం ఇవ్వడం ద్వారా పేర్ని నాని కుటుంబానికి అధికారులు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేరం చేసి తప్పించుకునెలా అధికారుల చర్యలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు చెబుతున్నా, ఆ సంఖ్య అంతకుమించే ఉంటుందని అధికారులు అంటున్నారు. వాస్తవంగా ఎన్ని బస్తాలు మాయమై ఉంటాయన్న విషయంలో నేడు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పోలీసుల కేసు నమోదు
రేషన్ బియ్యం మాయమైన కేసులో ఈ నెల 10న గోదాము యజమాని జయసుధ, మేనేజర్ మానస్ తేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే జయసుధ ఈ నెల 13న బెయిలు కోసం దరఖాస్తు చేయగా, విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న జయసుధ విదేశాలకు పారిపోకుండా పోలీసులు తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. కాగా, మాయమైన బియ్యం విలువకు సంబంధించి పేర్ని నాని కుటుంబం రూ. 1.7 కోట్లు చెల్లించిన నేపథ్యంలో నాని నిన్న అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. తన నివాసంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేశ్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తదితరులతో సమావేశమయ్యారు. ఈ కేసుతో ఏపీ రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి.

Related Posts
చంద్రబాబు సమక్షంలో మంత్రి భరత్ సంచలన వ్యాఖ్యలు
Minister Bharat sensational comments in the presence of Chandrababu

జ్యూరిచ్: జ్యూరిచ్‌లో పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి భరత్ మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేశ్‌ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వేదికపై సీఎం చంద్రబాబు కూడా Read more

ఏపీలో మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు
Servers of registration dep

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో భారీ రద్దీ నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో, ప్రజలు గుత్తుగా Read more

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన..!
Chandrababu's visit to tirupathi from today

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం యల్లమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్ధిదారుల Read more

సీఎం చంద్రబాబుతో డీజీపీ గుప్తా భేటీ
DGP Gupta met with CM Chand

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *