perni nani

పేర్నినాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు కావడంతో ఆయన హై కోర్టును ఆశ్రయంచారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను ఏ6గా పేర్కొన్నారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పేర్ని నాని పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిటిషన్ ను విచారించనుంది.

బెయిల్ పై వున్న జయసుధ

ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైల్లో ఉన్నారు.. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదయింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Related Posts
నటి కాదంబరీ జత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
AP government handed over the investigation of actress Kadambari Jethwani case to CID

అమరావతి: బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ Read more

కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
pawan kalyan

ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల ప్రక్రియకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కీలక ముందడుగు పడింది. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

ఏపీలో కొత్తగా మరో 4 లైన్ల రహదారి
4line highway line Ap

తిరుమల వెళ్లే వారికీ గుడ్ న్యూస్ తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వేలాదిగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. Read more

నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కామెంట్స్
pawan

ఇటీవల కాలంలో నాగబాబుకు మంత్రి పదవిపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *