earthquake

పెరుగుతున్న భూకంపం మృతుల సంఖ్య

టిబెట్‌ను భారీ భూకంపం వణికిస్తోంది. ఇవాళ ఉదయం కేవలం గంట వ్యవధిలోనే టిబెట్‌ ప్రాంతంలో ఆరుసార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. పెను భూకంపం ధాటికి ఇప్పటి వరకూ 95 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 130 మంది గాయపడ్డారు.

Advertisements

టిబెట్‌ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. నేపాల్‌ – టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ తర్వాత స్వల్ప తీవ్రతతో పలుమార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా ఈ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య వందకు చేరువైంది.

నేపాల్‌ – టిబెట్‌ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన మానిట‌రింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రత‌ను 6.8గా పేర్కొన్నది. టిబెల్ రాజ‌ధాని లాసాకు సుమారు 380 కిలోమీట‌ర్ల దూరంలో భూమి కంపించిన‌ట్లు తెలుస్తోంది.
భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. ఢిల్లీ ఎన్సీఆర్‌, బెంగాల్‌, బీహార్‌, అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపణలు సంభవించాయి. బీహార్‌లో ఆందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఇక చైనా, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.

Related Posts
చైనాలో కొవిడ్‌ మాదిరి కొత్త వైరస్‌ గుర్తింపు !
Identification of a new virus similar to Covid in China!

జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు బీజీంగ్‌: చైనా లో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు Read more

Pakistan Navy: అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ నావికాదళం విన్యాసాలు
అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ నావికాదళం విన్యాసాలు

పాకిస్తాన్ నావికాదళం కీలక సైనిక విన్యాసాలకు సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ కసరత్తులు కొనసాగనున్నాయి. కరాచీ, గ్వాదర్ పోర్టుల సమీపంలోని అరేబియా సముద్ర Read more

అమెరికాకు బదులుగా ఈ దేశాలు..
వీసా రద్దును సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు

అమెరికాలో H-1B వీసా నిలిపివేస్తారనే వార్తలు భారతీయుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ వీసా నిలిచిపోతే, అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం కష్టమవుతుంది. కాబట్టి విదేశాల్లో స్థిరపడాలని Read more

Plane Crash : అమెరికాలో మరో విమాన ప్రమాదం
Plane Crash us

అమెరికాలో విమానాలు, హెలికాప్టర్ల వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ చిన్న విమానం రహదారిపై కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ Read more

Advertisements
×