పుష్ప 2 రీలోడెడ్ ప్లాన్ మేకర్స్‌కు సక్సెస్‌ను అందిస్తుందా? 43 రోజుల తరువాత థియేటర్స్‌లోకి వచ్చిన ఈ కొత్త వెర్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇంతకాలంగా కలలు కంటున్న 2000 కోట్ల క్లబ్ లో పుష్ప రాజ్ అడుగు పెట్టడమే ఆలస్యం. మళ్లీ థియేటర్స్ ప్రేక్షకులతో నిండిపోతున్నాయా ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా 10 రోజులకే థియేట్రికల్ రన్ ముగిసిపోతుంది. నెల రోజుల్లోనే ఓటిటీలోకి వస్తుంది. కానీ పుష్ప 2 మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. 44 రోజులుగా థియేటర్స్‌లో కొనసాగుతూ, ఇప్పటికీ భారీ వసూళ్లను సాధిస్తోంది. సంక్రాంతి సినిమాల రష్ మధ్య కూడా “తగ్గేదే లే” అంటున్న పుష్ప తన హవాను కొనసాగిస్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1860 కోట్ల రూపాయల కు పైగా వసూలు చేసిన ఈ సినిమా, 1900 కోట్ల క్లబ్‌లోకి చేరడానికే సిద్ధంగా ఉంది. అదే సమయంలో రీలోడెడ్ వెర్షన్ పేరుతో 20 నిమిషాల కొత్త ఫుటేజ్ జోడించి జనవరి 17న మళ్లీ థియేటర్స్‌లోకి తీసుకొచ్చారు. ఈ ప్రయత్నం పూర్తిగా విజయవంతమైంది.రీలోడెడ్ వెర్షన్ సిటీల్లో హౌజ్ ఫుల్ బోర్డులు సాధించడంతో, ప్రేక్షకుల స్పందన అద్భుతంగా మారింది. కొన్ని స్క్రీన్స్‌లో మాత్రమే ప్రదర్శింపబడుతున్నప్పటికీ, ప్రతి స్క్రీన్ పూర్తిగా నిండిపోతుంది. ఇదే దూకుడు మరో 10 రోజులు కొనసాగితే, 2000 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం ఖాయం.
ఈ ఫీట్ సాధించినట్లయితే, ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ మైలురాయిని అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలుస్తుంది. ఈ ఘనత సాధించడం ద్వారా పుష్ప 2 ఏమీ సాధారణ సినిమా కాదని మరోసారి నిరూపిస్తుంది.”తగ్గేదే లే” అని నినదిస్తున్న పుష్ప రీ లోడెడ్ మేకర్స్‌కు కూడా భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ అంచనా ప్రకారం, పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ సినిమాల లాండ్మార్క్‌లను తిరిగి లిఖిస్తోంది.సినిమా థియేటర్‌లో చూసే అనుభవాన్ని కొత్తగా ఆవిష్కరించిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్, ప్రేక్షకుల హృదయాలను మరింత బలంగా కదిలించింది. రాబోయే రోజుల్లో పుష్ప 2 కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం!