pushpa 2 dec 5

‘పుష్ప 2’ ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప-2” చిత్రం అధికారిక విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపారు. మొదట ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేయాలని భావించినా, ఇప్పుడు ఒక రోజు ముందుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Advertisements

“పుష్ప” ముందు భాగం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పాత్ర, కథ మరియు మ్యూజిక్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ పార్ట్ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ విలువలు, సాంకేతికతతో రూపొందిస్తున్నారని అంటున్నారు.

కాగా ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా..థమన్ BGM అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ లో ఐటెం సాంగ్ లో శ్రీలీలే చిందులేయబోతుంది.

Related Posts
మోహన్‌బాబు దాడిని ఖండించిన జర్నలిస్టులు
mohanbabu attack

సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టు రంజిత్‌పై చేసిన దాడిని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన మీడియా స్వేచ్ఛను దెబ్బతీసే Read more

మంచు ఫ్యామిలీ ఫైట్… మంచు లక్ష్మీ ఆసక్తికర పోస్ట్
manchu laxmi post

మంచు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న ఆస్తి గొడవలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు Read more

మళ్ళీ ఓ సినిమా లో నటిస్తున్న తమన్
మళ్ళీ ఓ సినిమా లో నటిస్తున్న తమన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' చిత్రంలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ చిత్రంలో హీరో సిద్ధార్థ్ స్నేహితుడిగా Read more

నాన్న చిన్నప్పుడు అలా అనేవారు..సమంత ఎమోషనల్
sam emoshanal

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. స‌మంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామ్ తన Read more

Advertisements
×