ys jagan

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నాలుగు రోజుల జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ .. తన సొంత నియోజకవర్గం పులివెందులలో స్థానికుల నుంచి చాలా కాలం తర్వాత ఫిర్యాదుల్ని స్వీకరించారు.
దీంతో జనం కూడా జగన్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు.
భారీగా తరలివచ్చిన జనం
వైఎస్సార్ జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ ఇవాళ ఉదయం పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉన్న జగన్.. ఇవాళ క్యాంప్ ఆఫీసుకు రావడంతో జనం కూడా భారీగా తరలివచ్చారు. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి. స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం మారాక పులివెందులలో పరిస్ధితులపై వారు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.

Related Posts
తెలంగాణ ఎమ్మెల్యేకు టీటీడీ గుడ్ న్యూస్
ttd temple

తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు చిక్కులు తొలగినట్లే. Read more

మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
ysrcp mp nandigam suresh satirical comments on pawan kalyan jpg

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే Read more

పవన్ క్యాంపు ఆఫీస్ పై గుర్తు తెలియని డ్రోన్..!!
unidentified drones over Pa

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ కలకలం రేపింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం మీద శనివారం మధ్యాహ్నం Read more

రచయిత త్రివిక్రమ్ కన్నుమూత..
Katuri Ravindra Trivikram

సాహిత్య జగత్తులో విశిష్టతను చాటుకున్న రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ (80) విజయవాడలో గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. అరసం గౌరవ సలహాదారుగా, కథా రచయితగా పేరుపొందిన త్రివిక్రమ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *