పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది – కేటీఆర్

ప్రొ. జయశంకర్ జయతి ఈరోజు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలు , యువత ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోశారని KTR ట్వీట్ చేశారు. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. ‘పుట్టుక మీది, చావు మీది.. బతుకంతా తెలంగాణది. ఉద్యమ భావజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనది. ఆయన అడుగు జాడల్లోనే తెలంగాణ పోరాటం. తెలంగాణ ప్రగతి ప్రస్థానం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన వ్యక్తి ప్రొ. జయశంకర్. 1934లో WGL(D) అక్కంపేటలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో ముఖ్యమైన పదవులు చేపట్టిన ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. సమైక్య పాలనలో TGకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ సహా ఎందరినో చైతన్య వంతం చేశారు. జనాన్ని జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు.

తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక… pic.twitter.com/6TTW4FXysS— KTR (@KTRBRS) August 6, 2024