manipur cm

పీవీ కూడా మణిపూర్ లో పర్యటించలేదు: బీరేన్ సింగ్

గత ఏడాదిన్నరగా మణిపూర్ లో జాతులమధ్య జరుగుతున్న హింసలో వందలాది మంది జనం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి మణిపూర్ రగిలిపోతున్నది. ప్రజలు ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అయినా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఓవైపు మణిపూర్ వాసులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే మోదీ మాత్రం విదేశీ పర్యటనలకు వెళుతున్నాడని మండిపడింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలో తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందు మణిపూర్ మంటలను చల్లార్చాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ కానీ బీజేపీ నేతలు కానీ పెద్దగా స్పందించలేదు.


స్పందించిన సీఎం బీరేన్ సింగ్
తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. జైరామ్ రమేశ్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. అసలు మణిపూర్ లో మంటలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, 1992లో మణిపూర్ లో అల్లర్లు మొదలయ్యాయని ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం మయన్మార్ తో, మయన్మార్ మిలిటెంట్లతో కుదుర్చుకున్న ఒప్పందంతో మణిపూర్ లో అల్లర్లకు బీజం పడిందని చెప్పారు. 1992-97 మధ్య కాలంలో మణిపూర్ లోని నాగా, కుకీ తెగల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.

అప్పట్లో ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు మణిపూర్ లో పర్యటించారా.. ఎందుకు పర్యటించలేదని కాంగ్రెస్ నేతలను బీరేన్ సింగ్ నిలదీశారు. ఆ తర్వాత కూడా 1997- 98 మధ్య కాలంలో కుకీలు, పైతీల మధ్య గొడవలు జరిగి రాష్ట్రంలో 350 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

అప్పుడు ప్రధానిగా ఉన్న ఐకే గుజ్రాల్ మణిపూర్ లో పర్యటించారా..? రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారా? అని ప్రశ్నించారు.

Related Posts
మహాకుంభ్‌లో యూపీ ప్రభుత్వం ప్రత్యేక కేబినెట్‌ సమావేశం
up cabinet

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభ్‌లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. మధ్యాహ్నం సభ జరుగుతుందని, అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర మంత్రులతో కలిసి మహా Read more

IMD హెచ్చరిక: ఈ శీతాకాలంలో మరో తుపాన్ ప్రభావం
cyclone

శీతాకాలం దేశంలో మొదలైంది. అనేక రాష్ట్రాలలో వర్షాలు, మెరుపులు కనిపిస్తుండగా, భారత వాతావరణ శాఖ (IMD) ఈ సీజన్‌లో మరో తుపాను గురించి హెచ్చరిక విడుదల చేసింది. Read more

కుంభమేళా తొక్కిసలాటపై ప్రధాని మోదీ, సీఎం యోగి దిగ్భ్రాంతి
కుంభమేళా తొక్కిసలాటపై ప్రధాని మోదీ, సీఎం యోగి దిగ్భ్రాంతి

మౌని అమావాస్య నాడు ఉదయం జరిగిన మహా కుంభంలో తొక్కిసలాట తలెత్తడంతో సుమారు 30 మంది మహిళలు గాయపడ్డారు. మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందని తెలుసుకున్న వెంటనే, Read more

టీ20 ర్యాంకింగ్స్ లో యువ ఓపెనర్.
abhisheksharma

ఇంగ్లండ్‌పై ఐదో టీ20లో 37 బంతుల్లోనే శ‌త‌కం న‌మోదు చేసిన యువ బ్యాట‌ర్‌.. ఈ రికార్డు బ్రేకింగ్ సెంచరీతో ఏకంగా రెండో ర్యాంక్ ద‌క్కించుకున్నాడు. ఏకంగా 38 Read more