పాకిస్థాన్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయని, సామూహిక జన హనన ఆయుధాల తయారీకి సాయపడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ డీసీ) కూడా ఉంది. ఇది పాక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది.
నాలుగు కంపెనీలపై ఆంక్షలు
ఇది సామూహిక జనహనన ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాక్ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ సహా నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. దీంతో పాటు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. క్షిపణి ప్రయోగానికి వినియోగించే పరికరాలను ఎన్ డీసీ కొనుగోలు చేస్తోందని, షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని అమెరికా వెల్లడించింది. ఈ పరికరాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను ఎన్ డీసీకి అక్తర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ సరఫరా చేస్తోందని తెలిపింది.
అమెరికా పక్షపాతధోరణి: పాక్ ఆరోపణ
ఎన్ డీసీ తరఫున మిసైల్ లో వినియోగించే పలు పరికరాలను అఫిలియేట్‌ ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ చెప్పారు. కాగా, తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నవని పాక్ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా మరోసారి పునరాలోచించాలి పాక్ కోరుతున్నది.

Related Posts
సిరియాలో రష్యా సైనిక బలాల ఉపసంహరణ
military withdraw

రష్యా సిరియాలో తన సైనిక బలాలను ఉపసంహరించుకోవడానికి సిద్ధమవుతోందని తాజా ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. మాక్సార్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు రష్యా ఖ్మెయిమిం ఎయిర్‌ఫీల్డ్‌లో రెండు Read more

డీల్ కుదిరినట్టేనా? జెలెన్‌స్కీ నుంచి ట్రంప్‌కు లేఖ
జెలెన్ స్కీతో ట్రంప్ ఫోన్, కీలక చర్చలు

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నుంచి తనకు ముఖ్యమైన సందేశం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. Read more

H-1B Visa: హెచ్1బీ వీసాలపై అమెరికా మరో షాక్
హెచ్1బీ వీసాలపై అమెరికా మరో షాక్

అమెరికా ప్రభుత్వం కీలక డేటాను డిలీట్ చేయనున్నట్టు ప్రకటించిందిహెచ్1బీ వీసా హోల్డర్లకు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతంలో Read more

పుతిన్, జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చలు
పుతిన్, జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చలు

ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందడుగు వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. Read more