rambabu pawan

పవన్ కల్యాణ్‌కు నిజంగానే తిక్క ఉంది – అంబటి

కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అడ్డుకోవడంపైనా అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ గుర్తించారు.మొత్తంగా ఆ బియ్యం విలువ 6 కోట్ల 64 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం (పీడీఎస్‌) అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతోందని జిల్లా కలెక్టర్‌కు పక్కాగా సమాచారం వచ్చింది.

వెంటనే ఆయన బార్జ్‌లు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్ట్, మెరైన్, రెవెన్యూ పౌర సరఫరాల బృందంతో కలిసి ఐదు నాటికల్‌ మైళ్ల (సుమారు తొమ్మిది కిలోమీటర్ల) దూరం సముద్రంలో ప్రయాణించి స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌక పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. సుమారు 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడ్‌ కాగా అందులో 640 టన్నులు పీడీఎస్‌ బియ్యం అని గుర్తించారు.

ఇక ఈ విషయం తెలిసి స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి..అధికారులపై ఫైర్ అయ్యారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే.. దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని, అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న కింగ్ పిన్ లను గుర్తించాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేసారు. పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి..? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా..? అని అనుమానాలు వ్యక్తం చేసారు.

కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అడ్డుకోవడంపైనా అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. అప్పటికే కలెక్టర్‌ పట్టుకున్న రేషన్‌ బియ్యాన్ని చూడటానికి పవన్‌ కల్యాణ్‌ సాహసోపేతంగా వెళ్లారని ఎద్దేవా చేశారు. తీరా ఒడ్డుకు వచ్చిన తర్వాత విచిత్రమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. రెండు నెలల నుంచి అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారని.. వారు సహకరించడం లేదని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారని గుర్తుచేశారు. అసలు ఆయన ప్రభుత్వంలో ఉన్నారో.. లేదంటే ప్రశ్నించే పక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదని రాంబాబు చెప్పుకొచ్చారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికడతామని చెప్పిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌.. దీనికి బాధ్యత వహిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అధికారులు తనను అడ్డుకున్నారని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారని.. బహుశా చంద్రబాబు, నారా లోకేశ్‌ చెప్పడంతోనే అధికారులు అడ్డుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఉప ముఖ్యమంత్రికి అంతలా ప్రాధాన్యం ఇవ్వద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమోనని అన్నారు.

కూటమి నేతల సహకారంతోనే ఈ స్కామ్‌ జరుగుతుందని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్యే కొండబాబుకు మామూళ్లు వెళ్లకుండానే ఇదంతా జరుగుతుందా అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Related Posts
హరీశ్ రావు ఫ్యామిలీ పై చీటింగ్ కేసు
Harish Rao stakes in Anand

సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి హరీష్ రావు ఫ్యామిలీ సభ్యులపై చీటింగ్ కేసు నమోదైంది. హరీష్ రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో Read more

నేడు మోకిల పీఎస్‌కు రానున్న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల
KTR brother in law Raj Pakala is coming to Mokila PS today

హైదరాబాద్‌: జన్వాడ ఫాంహౌస్ కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల Read more

ఆట స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు
1500x900 1079640 gandhibabji

ఆట స్థలం కబ్జా పై చర్యలు తీసుకోవాలంటూ గ్రీవెన్స్ లో ఫిర్యాదువెలగపూడి : టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ సమస్యలతో Read more

విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫిర్యాదు
buddavenkanna

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *