kartika

పర్వదినాల పండుగగా పరిగణించే కార్తిక మాసం

తెలుగు సంవత్సరంలో కార్తిక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఈ నెలలో హరిహరాదులను స్తుతించడం సహా వివిధ పూజలు, వ్రతాలకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ఈ సమయంలో చేసే ఆచారాలు మరియు విధానాలు భక్తుల జీవితంలో గొప్ప శ్రేయస్సును తీసుకువస్తాయని నమ్ముతారు.

కార్తికం, తెలుగు సంవత్సరంలో ఎనిమిదో నెల, కృత్తికా నక్షత్రంతో కూడి వస్తుంది. దీపావళి అనంతరం ప్రారంభమయ్యే ఈ నెలలో ప్రతి రోజూ పర్వదినంగా పరిగణిస్తారు. శివకేశవులను కొలిచే పూజలు, వ్రతాలు అనేక శుభఫలితాలు చేకూర్చుతాయని పురాణాలు చెబుతాయి. ఆ రోజులలో ఉపవాసం ఉండి, చీకటి పడ్డాక నక్షత్ర దర్శనం చేసుకుని… ఆ తరువాత భోంచేస్తే అక్షయ సంపదలూ, సర్వశుభాలూ లభిస్తాయనీ కార్తిక పురాణంలో ఉంది.

సోమవారం ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగించడం వల్ల కలిగే పుణ్యం అమితంగా మహత్తరమైనది. కార్తిక మాసంలో ప్రతిరోజూ పర్వదినం అయితే కొన్ని ముఖ్యమైన రోజులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీపావళి తరువాత వస్తున్న భగినీ హస్త భోజనం, నాగులచవితి, నాగపంచమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, మరియు కార్తిక పౌర్ణమి వంటి పండుగలు ముఖ్యమైనవి.

ఈ నెలలో శివపూజలు, లక్ష బిల్వ దళాల పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన మరియు కేదారేశ్వర వ్రతం నిర్వహించడం విశేషం. కార్తిక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉత్సవంగా చేస్తారు.ఈ నెలలో శ్రవణా నక్షత్రం సోమవారం రావడం అరుదు. ఇలాంటప్పుడు ఆ రోజును కోటి సోమవారగా పిలుస్తారు. ఆ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాల పుణ్యం దక్కుతుందంటారు.

ఈ మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమై సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. అలాగే గంగానది, ఇతర నదులు, చెరువులు, కొలనులు పవిత్రంగా మారతాయని పండితులు చెబుతారు. కార్తిక మాసంలో దీపారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెలలో ప్రతిరోజూ మాత్రమే కాకుండా కార్తిక పౌర్ణమి రోజున వెలిగించే 365 దీపాల వల్ల గత జన్మలో, ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని కార్తిక పురాణం చెబుతుంది.

ఈ నెలలో కుదిరినన్ని రోజులు తెల్లవారు జామున లేచి స్నానం చేసి, కృత్తికా నక్షత్రం అస్తమించేలోగా తులసి కోటముందు దీపం పెట్టడం మంచిది. ఉదయం పెట్టే దీపం విష్ణువుకు, సాయంత్రం పెట్టే దీపం తులసికి చెందుతుందని వివరించడం విశేషం.అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వనభోజనాలకు వెళ్ళడం కూడా ఈ మాసంలో పాటించే సంప్రదాయాలలో ఒకటి. ఈ పవిత్ర మాసం మొత్తం భక్తులు హరిహర నామస్మరణలో మునిగిపోతారు, ఇది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయమే.

Related Posts
జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
TTD gears up for ‘Vaikunta Dwara Darshan from January 10 to 19

తిరుమల: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల Read more

రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. !
VIP break darshans canceled in Tirumala tomorrow.. !

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు ఓ ముఖ్య విషయాన్ని తెలియజేశారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబోతున్నారు. Read more

తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
tirumala vaikunta ekadasi 2

పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి ప్రత్యేక పూజలతో భక్తుల కోసం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతులు, Read more

మెడ నలుపు నుండి విముక్తి పొందడానికి సులభమైన చిట్కాలు
Dark Neck

మెడ ప్రాంతంలో నలుపు అనేది చాలా మందికి ఇబ్బంది కలిగించే సమస్య. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో దాని లక్షణాలు మరియు నివారణ గురించి తెలుసుకుందాం. కారణాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *