పరమేశ్వరుడి రూపంలో అక్షయ్ కుమార్

పరమేశ్వరుడి రూపంలో అక్షయ్ కుమార్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” షూటింగ్‌ను వేగంగా ముందుకు తీసుకెళుతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా గురించి వరుసగా ఆసక్తికరమైన అప్డేట్‌లు విడుదలవుతున్నాయి. ఇందులో మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి, రఘు బాబు, ఐశ్వర్య రాజేష్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు.ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందులో విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో రేబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారని వార్తలు వినిపించాయి.

పరమేశ్వరుడి రూపంలో అక్షయ్ కుమార్
పరమేశ్వరుడి రూపంలో అక్షయ్ కుమార్

అయితే, ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారనుకున్నప్పటికీ, అతని పాత్ర చిన్నదేనని సమాచారం.బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాత్రం శివుడి పాత్రను పోషిస్తున్నట్లు స్పష్టమైంది.తాజాగా, అక్షయ్ కుమార్ శివుడి లుక్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అక్షయ్ శివుడి గెటప్‌లో రోమాలు నిక్కబొడుచుకునేలా కనిపిస్తున్నారు. ఇక పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో ముఖేష్ రిషి, కరుణాస్, మధుబాలలు కనిపించనున్నారు.

ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో శరవేగంగా జరుగుతోంది.కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా, ఈ కథను ఓ విజువల్ వండర్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మంచు మోహన్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అబ్బురపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.గతంలో కన్నప్ప కథ ఆధారంగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, ఈసారి మంచి విష్ణు విభిన్నంగా, ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ కథను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించి అగ్ర నక్షత్రాల కలయికే ప్రత్యేక ఆకర్షణగా మారింది.ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు, ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ ద్వారా ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచాయి.

Related Posts
బాలయ్య కు పద్మభూషణ్ పురస్కారం
బాలయ్య కు పద్మభూషణ్ పురస్కారం

తెలుగు సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ బహుముఖ ప్రతిభతో తనను చాటి చెప్పిన బాలకృష్ణకు భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా Read more

15 ఏళ్లకే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్.. 1300 కోట్ల ఆస్తులు.. ఈ బ్యూటీ ఎవరంటే..
Asin

చిన్న వయసులోనే నటనపై ఆకర్షణతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ చిన్నారి, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన ముద్దు ముద్దు ముఖంతో, అభినయంతో అతి తక్కువ Read more

గ్లామరస్‌గా మారుతున్న తెలుగు భామలు..
Eesha Rebba

తెలుగమ్మాయిలు గ్లామరస్‌గా కనిపించేందుకు ఇష్టపడరని,అందుకే ముంబై భామలను హీరోయిన్లుగా ఎంపిక చేస్తున్నామని టాలీవుడ్‌ మేకర్స్‌ తరచూ చెబుతుంటారు.కానీ ఈ తరానికి చెందిన తెలుగమ్మాయిలు మాత్రం ఈ అభిప్రాయాన్ని Read more

ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలు.. భారీ వ్యూస్‍తో సత్తా
thrillers

ఓటీటీల్లో థ్రిల్లర్ చిత్రాల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.ఈ జానర్‌లో ఉండే ట్విస్టులు, సస్పెన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటాయి. ఈ ఏడాది వివిధ భాషల్లో వచ్చిన థ్రిల్లర్ సినిమాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *