Notices to Patnam Narender Reddy once again!

పట్నం క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసులో కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన ఇటీవలే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, 10 రోజుల క్రితమే పిటిషన్పై వాదనలు విన్న జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం తాజాగా నరేందర్ రెడ్డి చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. కాగా గతంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన విధానం పై హైకోర్టు తప్పు పట్టింది.

లగచర్ల భూసేకరణ కొరకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసులో ఏ1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రధాన కుట్రదారుడని పోలీసులు, ప్రభుత్వం తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వర్రావు కోర్టుకు తెలిపారు. ఏ2గా ఉన్న భోగమోని సురేష్ ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని వెల్లడించారు. సురేష్ తో దాదాపు 89 సార్లు నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారని ధర్మాసనానికి తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్ సహా ఇతర అధికారులను హత్య చేయాలనే కుట్రతో దాడి చేశారని కోర్టుకు విన్నవించారు. దాడికి కుట్రలో ఉందని.. అవన్ని దర్యాప్తులో బయడపడతాయని, అప్పటి వరకు కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. తాజాగా, ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నరేందర్ రెడ్డి దాఖలు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts
Telangana Budget :అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్‌!
Telangana Budget :అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్‌!

తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. సుమారు 3.30 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చినట్లు Read more

కొత్త రేషన్‌ కార్డుల్లో కీలక మార్పు
కొత్త రేషన్‌ కార్డుల్లో కీలక మార్పు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదటిగా మార్చి 1వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి Read more

సదరన్ ట్రావెల్స్ “హాలిడే మార్ట్”
Southern Travels "Holiday Mart"

హైదరాబాద్‌: సదరన్ ట్రావెల్స్, 45 లక్షల మందికి పైగా సంతోషకరమైన ప్రయాణీకులకు మరపురాని ప్రయాణ అనుభవాలను అందించడంలో 55 సంవత్సరాల వారసత్వంతో ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమలో Read more

దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ – తమన్
game changer jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. డైరెక్టర్ శంకర్ (Shankar) - మెగా పవర్ స్టార్ రామ్ Read more