fire crackers blast

పటాకుల పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు మృతి

తరచుగా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవిస్తున్నా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నది. దీనితో అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్‌ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పటాకుల పేలుడు ధాటికి కార్మికులు కొన్ని మీటర్ల దూరం ఎగరిపడ్డారు. సమీపంలోని ఆరు ఇండ్లు ధ్వంసమయ్యాయి.


పోలీసులు సహాయక చర్యలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశామన్నారు.
కాగా, గతేడాది అక్టోబర్‌లో కూడా తిరువూరు జిల్లాలోని ఓ పటాకుల గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వారిలో 9 నెలల చిన్నారి కూడా ఉన్నది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 ఇండ్లకుపైగా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దానికి ప్రజలు భయంతో పరుగులు తీశారు.

Related Posts
సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట..
Relief for CM Siddaramaiah in High Court

బెంగళూరు: కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణం కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తుపై హైకోర్టు కీలక నిర్ణయం Read more

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
nirmala sitharaman

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ Read more

రైతులకు కేంద్రం శుభవార్త
formers

పంటలకు మద్దతు ధర విషయంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోగునార పంటకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.305 మేర పెంచుతూ ప్రధాని నరేంద్ర Read more

Delhi Election Results: ఎర్లీ ట్రెండ్స్‌లో కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్ !
BJP big shock for Kejriwal in early trends

న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం Read more