new zealand mp hana rawhiti

న్యూజిలాండ్ ఎంపీ ‘హక’ వీడియో మరోసారి వైరల్

గతేడాది న్యూజిలాండ్ పార్లమెంట్లో ‘హక’ (సంప్రదాయ కళ) తమ కమ్యూనిటీపై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె వీడియో వైరల్ గా మారింది. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. బిల్లు పేపర్లు చించేస్తు… అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

Advertisements

ఎంపి పేరు హనా-రౌహితి మైపి క్లార్క్‌ (21). 1 70 ఏళ్లలో న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఆమె గత ఏడాది అక్టోబర్‌లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె తాత కూడా ఓ సామాజిక కార్యకర్త. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. అక్కడ మావోరి కమ్యూనిటీకి చెందిన చిన్నారుల కోసం గార్డెన్‌ నడుపుతూ చిన్నారులకు తోటపనిపై అవగాహన కల్పిస్తోంది. ఇక జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నేను మీ కోసం చనిపోతాను. కానీ నేను మీకోసం కూడా జీవిస్తాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు. మావోరీ భాష యొక్క సంరక్షకురాలిని. కొత్త జనరేషన్‌ యొక్క స్వరాన్ని వినిపిస్తాను. పార్లమెంటులోకి ప్రవేశించేముందు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏమీ తీసుకోకూడదని.. సరే, ఈ ఛాంబర్‌లో చెప్పిన ప్రతిదాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండలేను. కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వం రెండు వారాల్లోనే నా ప్రపంచం మొత్తం మీద (ఆరోగ్యం, నీరు, భూమి, సహజవనరులు, మావోరీ, వార్డ్స్‌, రెయో (భాషలపై) దాడి చేసింది. ఈ దేశంలో నాకు, మీకు ఉండే హక్కు ఉంది. ఇంటి నుండి చూస్తున్న ప్రతి వ్యక్తికి.. ఈ క్షణం నాది కాదు, ఇది మీది’ అంటూ ప్రసంగించి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి అదే మాదిరి వార్తల్లో హైలైట్ అవుతున్నారు.

🔥Unprecedented & simply magnificent. That time in Nov 2024 when a haka led by Aotearoa’s youngest MP 22yo Hana-Rawhiti Kareariki Maipi-Clarke erupted in the House stopping the Treaty Principles Bill from passing its first reading, triggering the Speaker to suspend Parliament.… pic.twitter.com/pkI7q7WGlr— Kelvin Morgan 🇳🇿 (@kelvin_morganNZ) November 14, 2024

Related Posts
చైనా హ్యాకర్లపై అమెరికా క్రిమినల్ అభియోగాలు
12 మంది చైనా హ్యాకర్లపై అమెరికా క్రిమినల్ అభియోగాలు

అమెరికా ప్రభుత్వం కొందరిపై చైనా హ్యాకర్లపై క్రిమినల్ అభియోగాలు మోపింది. వీరు ప్రభుత్వ ఏజెన్సీలు, వార్తా సంస్థలు, విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు Read more

నేపాల్‌లో యోగి ఆదిత్యనాథ్ ట్రెండ్ – ర్యాలీల్లో ఆయన ఫోటోలు చర్చనీయాంశం
నేపాల్‌లో యోగి ఆదిత్యనాథ్ ట్రెండ్ – ర్యాలీల్లో ఆయన ఫోటోలు చర్చనీయాంశం

నేపాల్‌లో 2008లో రాజరిక పాలన అంతమై, ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైనా, తాజాగా రాచరిక పునరుద్ధరణకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించబడుతున్నాయి. ఈ ర్యాలీల్లో నేపాల్ మాజీ Read more

Donald Trump: అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం
అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులను ప్రవేశపెట్టేందుకు అడుగులు వేశారు. ఆయన సంతకం చేసిన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎన్నికల విధానంలో Read more

ఉక్రెయిన్ మాస్కోపై అతిపెద్ద డ్రోన్ దాడి
drone attack

2022లో ప్రారంభమైన యుద్ధం తర్వాత, ఈ ఆదివారం ఉక్రెయిన్ మాస్కోపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్ కనీసం 34 డ్రోన్లను మాస్కోపై పంపింది. ఈ దాడి Read more

Advertisements
×