విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు గుర్లలో చేరుకుంటారు. ఈ పర్యటనలో డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను, అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. గతంలో, గుర్లలో అతిసారం బారిన పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.
