Hydra team going to Bangalore today

నేడు బెంగళూరుకు వెళ్లనున్న హైడ్రా బృందం

హైదరాబాద్‌: హైడ్రా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది. ఈ మేరకు రెండు రోజుల పాటు హైడ్రా బెంగళూరులో పర్యటించనుంది. బెంగళూరులో చెరువుల పరిరక్షణ ఎలా ఉంది..అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. అనే దానిపై అన్వేషణ హైడ్రా చేయనుంది. ఈ నేపథ్యంలోనే నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది.

Advertisements

చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. ఈ మేరకు బెంగళూరుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు..బయల్దేరనున్నారు. కాగా, హైడ్రా మళ్లీ రంగంలోకి దిగుతోంది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ హైడ్రా చేస్తోంది. కబ్జాను బట్టి వారం నుంచి 15 రోజుల టైం ఇస్తామంటున్నది. ఇప్పటికే సుమారు 60 నోటీసులు జారీ చేసింది హైడ్రా. ఈ నెలాఖరికి కొన్ని అక్రమ నిర్మాణాలను హైడ్రా డిమాలిష్ చేయనుంది. పూర్తిగా కబ్జా అయిన కొన్ని చెరువులకు తిరిగి పునరుజ్జీవనం కల్పిస్తామంటున్న హైడ్రా…. చెరువుల్లోకి వచ్చే వ్యర్ధాలను ఆపడానికి పిసిబి తో కలిసి పని చేయనుంది. చెరువుల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చే వారం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో MOU చేసుకోనుంది హైడ్రా.

Related Posts
పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటన : 33 మంది బీఎల్ఏ మిలిటెంట్లు మరణం
pak train hijack

పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రైలు హైజాక్ ఘటనకు తెరపడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు హైజాక్ చేసిన రైలును పాకిస్థాన్ భద్రతా బలగాలు విజయవంతంగా తిరిగి Read more

Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?
Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?

వేసవి వేడి భరించలేని స్థాయికి చేరిన ఈరోజుల్లో, ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఓ కాలేజీ ప్రిన్సిపల్ చేసిన పని నెట్టింటా హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన Read more

త్వరలో భారత్‌కు రానున్న జేడీ వాన్స్ !
JD Vance coming to India soon!

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే జేడీ వాన్స్ ఫ్యామిలీ Read more

ఏపీ సీఎంతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ
NITI Aayog Vice Chairman meets AP CM

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం ఈరోజు సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర Read more

×