ycp

నారా లోకేశ్‌పై మండిపడ్డ వైసీపీ

ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ మండిపడింది. ఈ మేరకు టీడీపీ చెప్పిన అబద్ధాలకు సంబంధించి పలు ప్రశ్నలను ట్విట్టర్‌ ( ఎక్స్‌) వేదికగా నిలదీసింది. అధికారంలోకి రాగానే త‌ల్లికి వంద‌నం పేరుతో ఇంట్లో ఎంత మంది స్కూల్‌కు వెళ్లే పిల్లలుంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తామ‌ని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా? గత ప్రభుత్వ పాలకులు ఉత్తరాంధ్రకు ఏం పీకారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. గతం ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని సూచించింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బాబు ఏం పీకాడు అని ప్రశ్నించింది. ఉద్యోగుల సీపీఎస్‌, జీపీఎస్ విధానాన్ని పునఃస‌మీక్షిస్తామ‌ని చెప్పింది మీరు కాదా? స‌మీక్షించారా?


– ఉద్యోగుల‌కు ఐఆర్‌, డీఏ ప్రక‌టిస్తామ‌ని హామీ ఇచ్చింది మీరు కాదా? చేశారా?
– మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణం క‌ల్పిస్తామ‌ని చెప్పింది మీరు కాదా? క‌ల్పించారా?
ఏడాదికి 5 ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చెప్పింది మీరు కాదా? క‌ల్పించారా?
నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా?
ఏటా జ‌న‌వ‌రి 1న జాబ్ క్యాలెండ‌ర్ ప్రక‌టిస్తామ‌ని చెప్పింది మీరు కాదా? ప్రక‌టించారా?
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పింది మీరు కాదా? చేశారా?
అధికారంలోకి రాగానే వాలంటీర్లకు వేతనం రూ.5వేల నుంచి రూ.10 వేలు పెంచుతామ‌ని చెప్పింది మీరు కాదా? పెంచారా?అధికారంలోకి రాగానే మ‌హిళ‌ల‌కు మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా?
రైతులకు ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది మీరు కాదా? చేశారా?
19 నుంచి 59 ఏళ్ల లోపు మ‌హిళ‌లంద‌రికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆర్థిక స‌హాయం చేస్తామ‌ని చెప్పింది మీరు కాదా? స‌హాయం చేశారా?

    ఇప్పుడు చెప్పు లోకేష్ ఎవ‌రిది ఫేక్ పార్టీ అని వైసీపీ నిలదీసింది. గత ప్రభుత్వ పాలకులు ఉత్తరాంధ్రకు ఏం పీకారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. గతం ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని సూచించింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బాబు ఏం పీకాడు అని ప్రశ్నించింది. నీకు గుర్తు ఉందో లేదా.. విశాఖకు రైల్వే జోన్ వద్దు, విజయవాడకు ఇవ్వండి అంటూ నాటి ఎంపీలు రాయపాటి, గల్లా జయదేవ్ చేత కేంద్రానికి మీ బాబు లేఖలు రాయించింది మరిచిపోయావా? అని ప్రశ్నించింది. 14 ఏళ్లు సీఎంగా ఉండి నువ్వు ఏం పీకావని ఇంటికి వెళ్లి మీ బాబును అడుగు అని మండిపడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ఎంత చేశారో చూడమని పలు ఉదాహరణలు చెప్పింది.

    Related Posts
    మంత్రులకు సీఎం దిశా నిర్దేశం.
    chandrbabu naidu

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం జరిగిన తరువాత మంత్రులతో వేరుగా భేటీ అయ్యారు.పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందరూ గేర్ మార్చాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని Read more

    నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
    registration charges

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా భూక్రయ విక్రయాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు మరియు ఇతర లావాదేవీలు పెరిగాయి. చార్జీల పెంపు Read more

    ఏపీలో మగవారికీ పొదుపు సంఘాలు.. నిబంధనలు ఇవే
    Men's Savings

    ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన పొదుపు సంఘాలను ఇప్పుడు మగవారికీ విస్తరించేందుకు మెప్మా (MEPMA) చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అధికారులు Read more

    విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించిన యాజమాన్యం
    vizag steel plant employees

    విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రమే Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *