pawan

నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కామెంట్స్

ఇటీవల కాలంలో నాగబాబుకు మంత్రి పదవిపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌‌లో మాట్లాడుతూ… ‘‘మనతో ప్రయాణం చేసి, పని చేసిన వారిని నేను గుర్తించాలి నాగబాబు నాతో పాటు సమానంగా పని చేశారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు, పార్టీ కొసం నిలబడ్డారు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పనిమంతుడా కాదా అనేదే ముఖ్యం. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించాం. మనోహర్, హరిప్రసాద్‌లు మొదటి నుంచి పార్టీ కోసం పని చేశారు.

Pawan Kalyan

రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం

ఇదే విషయంలో జగన్‌ను మీరెందుకు అడగలేదు. కేవలం పవన్ కళ్యాణ్‌ను మాత్రమే అడుగుతారు. మాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తరువాతతరం పిల్లలకు ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అనేది తరువాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నాం.

అతని పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం’’ అనిచెప్పుకొచ్చారు. ముందు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాకనే మంత్రి పదవి గురించి ఆలోచిస్తానని అన్నారు. ఎక్కడో ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే ఎమ్మెల్సీ కాకముందు మంత్రి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ ఇప్పుడు అంత ప్రత్యేక పరిస్థితులు ఏమి లేవన్నారు.

Related Posts
NDRF సేవలు ప్రశంసనీయం – చంద్రబాబు
CBN NDRF

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా క్లిష్ట సమయాల్లో NDRF అందించే Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

జగన్ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్
nimmala

పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ లాగా వాడుకున్నారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యలకు Read more

వచ్చే నెలాఖరు వరకు ఖరీఫ్ ధాన్యం సేకరణ
Kharif grain

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ధాన్యం విక్రయానికి నోచుకోని రైతులకు మరింత సౌలభ్యం కలుగనుంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *