ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.తన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలను న్యాయమూర్తికి అందజేశారు.అనంతరం అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.డిసెంబర్ 4న పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్ వల్ల సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో ఒక మహిళా అభిమాని మృతి చెందింది.

ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు.అల్లు అర్జున్ ఈ కేసులో అక్కుయర్ 11 గా ఉన్నారు. అయితే శుక్రవారం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు కండీషనల్ బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లి బెయిల్ పూచీకత్తులను సమర్పించి తిరిగి వెళ్లిపోయారు. కోర్టు ఆదేశం మేరకు, 2 పూచీకత్తులను రూ. 50,000 చొప్పున సమర్పించుకోవాలని పేర్కొంది. అలాగే, వచ్చే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఇంకా కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని న్యాయమూర్తి సూచించారు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాట కారణంగా, ఒక మహిళా అభిమాని మృతి చెందింది. మొదట, నాంపల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించినప్పటికీ, అదే రోజు హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.