నన్ను, కుమారుడిని అరెస్టు చేయవచ్చు: పేర్ని నాని

నన్ను, కుమారుడిని అరెస్టు చేయవచ్చు: పేర్ని నాని

నన్ను, నా కుమారుడిని అరెస్టు చేయడానికి ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను, తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేయవచ్చని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భార్యను అరెస్ట్‌ చేయడానికి ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

నన్ను, కుమారుడిని అరెస్టు చేయవచ్చు: పేర్ని నాని


తన భార్య పేరిట ఉన్న గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను ఒక్కరోజైనా జైలులో పెట్టాలనే ఆలోచన జిల్లాకు చెందిన మంత్రి ఒకరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తన భార్యను కూడా జైలుకు పంపాలని సీఎం చంద్రబాబు దగ్గర ప్రస్తావించినప్పటికీ ఇంట్లోని ఆడవారి జోలికి వెళ్లవద్దని ఆదేశించడం అభినందనీయమని నాని పేర్కొన్నారు.
చంద్రబాబు చెప్పిన్నా వినడం లేదు
చంద్రబాబు చెప్పినప్పటికీ వారు ప్రయత్నాలు ఆపడం లేదని కొంత మంది ఎమ్మెల్యేలు, అధికారులు ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. నా భార్య జయసుధపై కేసు పెట్టిననాటి నుంచి నేటి వరకు తన కుటుంబాన్ని అరెస్టుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
2వ తేదీన తమ గోదాం మేనేజర్‌ క్వాష్‌ పిటిషన్‌ విచారణ ఉంది. ఆలోగా నన్ను, నా కుమారుడిని పోలీసులు అరెస్టు చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తమ రాజకీయాలు, కక్ష సాధింపు కోసం ఇంట్లోని ఆడవాళ్ల జోలికి రావడం బాధాకరమని ఆయన అన్నారు.

Related Posts
ప్రభుత్వమే మారింది.. మిగతాదంతా సేమ్ టూ సేమ్ – షర్మిల కామెంట్స్
sharmila kutami

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల..కూటమి సర్కార్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వంలో ఎలాగైతే అత్యాచారాలు , మహిళలపై దాడులు , క్రైమ్ Read more

శ్వేతపత్రాలపై ఏం చేశారు…? అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
New law in AP soon: CM Chandrababu

అధికారంలోకి వచ్చి రాగానే చంద్రబాబు ..గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పత్రాల్లో అనేక అంశాలను ప్రస్తావించి వీటిపై Read more

పోసానిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు..
posani arest

ఏపీలో కూటమి సర్కార్ దూకుడు రోజు రోజుకు పెంచుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే తమ పై విమర్శలు , అసభ్యకర మాటలు , వీడియోలు పోస్ట్ చేసి Read more

Amaravati: రూ.11 వేల కోట్లతో ఏపీ రాజధానికి కొత్త కళ..!
amaravati

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రతిపాదనలు, కేంద్రం నుండి ఆర్థిక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *